సర్బ్ జిత్ | |
---|---|
దర్శకత్వం | ఓమంగ్ కుమార్ |
రచన | ఉత్కర్షణీ వశిష్ఠ, రాజేష్ బేరి |
నిర్మాత | వాశూ భగ్నానీ జాకీ భగ్నానీ దీప్షికా దేశ్ ముఖ్ సందీప్ సింగ్ ఓమంగ్ కుమార్ భుషన్ కుమార్ క్రిషన్ కుమార్ |
తారాగణం | ఐశ్వర్యరాయ్ బచ్చన్, రణదీప్ హుడా, రిచా చడ్డా |
ఛాయాగ్రహణం | కిరణ్ డియోహన్స్ |
కూర్పు | రాజేష్.జి.పాండే |
సంగీతం | జీత్ గంగూలీ అమాల్ మాలిక్ తనిష్క్ బగ్చీ షైల్-ప్రీతేష్ శశి శివమ్ |
నిర్మాణ సంస్థలు | గుల్షన్ కుమార్ పూజా ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఫిల్మ్స్ లిమిటెడ్ లెజెండ్ స్టూడియోస్ |
పంపిణీదార్లు | టి -సిరీస్ |
విడుదల తేదీ | 20 మే 2016 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
సర్బ్ జిత్ 2016లో విడుదలైన హిందీ సినిమా. గుల్షన్ కుమార్, పూజా ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఫిల్మ్స్ లిమిటెడ్, లెజెండ్ స్టూడియోస్ బ్యానర్‌ల పై వాశూ భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్ ముఖ్, సందీప్ సింగ్, ఓమంగ్ కుమార్, భుషన్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఐశ్వర్యరాయ్ బచ్చన్, రణదీప్ హుడా, రిచా చడ్డా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 20 మే 2016న విడుదలైంది.
సర్బ్ జిత్ సింగ్ (రణదీప్ హుడా) ఓ పంజాబీ రైతు. అనుకోకుండా ఓ రోజు పాకిస్థాన్ బార్డర్ లోకి వెళ్తాడు. ఆ తర్వాత పాకిస్థాన్ లో సర్బ్ జిత్ ను ఓ కేసులో ఇరికించి జైలు శిక్ష విధిస్తారు. సర్బ్ జిత్ కోసం అతని చెల్లెలు దల్బీర్ కౌర్ (ఐశ్వర్య రాయ్) పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో ఆమె ఎన్ని సమస్యలను ఎదురుకుంది అనేదే మిగతా సినిమా కథ.[1]