సశస్త్ర సీమా బల్ | |
---|---|
![]() సశస్త్ర సీమా బల్ ఎంబ్లెం | |
![]() సశస్త్ర సీమా బల్ జండా | |
పొడిపదాలు | SSB |
నినాదం | Service, Security and Brotherhood |
ఏజెన్సీ అవలోకనం | |
ఏర్పాటు | 20 డిసెంబరు 1963 |
ఉద్యోగులు | 94,261 సిబ్బంది[1] |
వార్షిక బడ్జెట్టు | ₹7,653.73 crore (US$958.5 million) (2022–23)[2] |
అధికార పరిధి నిర్మాణం | |
Federal agency | భారత్ |
కార్యకలాపాల అధికార పరిధి | భారత్ |
పరిపాలన సంస్థ | భారత హోం మంత్రిత్వ శాఖ |
పరికరం ఏర్పాటు | |
సాధారణ స్వభావం | |
ప్రధాన కార్యాలయం | ఢిల్లీ |
మాతృ ఏజెన్సీ | కేంద్ర సాయుధ పోలీసు బలగాలు |
సశస్త్ర సీమా బల్ (SSB ; సాయుధ సరిహద్దు దళం) అనేది నేపాల్, భూటాన్‌లతో భారత సరిహద్దుల వెంబడి మోహరించిన భారతదేశ సరిహద్దు రక్షణ దళం. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) పరిపాలనా నియంత్రణలో ఉన్న ఏడు కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఇది ఒకటి.
శత్రు కార్యకలాపాలకు వ్యతిరేకంగా భారతదేశపు సరిహద్దు ప్రాంతాలను బలోపేతం చేయడానికి చైనా-ఇండియా యుద్ధం తరువాత 1963లో ఈ దళాన్ని స్పెషల్ సర్వీస్ బ్యూరో పేరుతో ఏర్పాటు చేసారు.
సశస్త్ర సీమా బల్‌ను తొలుత 1962 భారత చైనా యుద్ధం తరువాత 1963 మార్చి 15 న స్పెషల్ సర్వీస్ బ్యూరో (సంక్షిప్తంగా SSB) పేరుతో ఏర్పాటు చేసారు. 2007 లో డిసెంబరు 20 న, SSB చట్టానికి రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాత, ఈ తేదీని దీని స్థాపనా దినంగా జరుపుతున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క విదేశీ గూఢచార విభాగానికి సాయుధ మద్దతును అందించడం ఈ దళం యొక్క ప్రాథమిక పని. ఇదే ఆ తరువాత 1968లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌గా మారింది. దీని రెండవ లక్ష్యం, సరిహద్దు జనాభాలో జాతీయ భావాలను పెంపొందించడం, అప్పటి NEFA, ఉత్తర అస్సాం, ఉత్తర బెంగాల్ లోని ఉత్తర ప్రాంతాలు, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్‌ల కొండ ప్రాంతాల్లో ప్రేరణ, శిక్షణ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తదితర కార్యకలాపాల ద్వారా వారి ప్రతిఘటన సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో తోడ్పడడం. ఈ కార్యక్రమాన్ని ఆ తరువాత 1965లో మణిపూర్, త్రిపుర, జమ్ములకు, 1975లో మేఘాలయకు, 1976లో సిక్కిం, 1989లో రాజస్థాన్, గుజరాత్, మణిపూర్, మిజోరాం సరిహద్దు ప్రాంతాలకు, 1988లో రాజస్థాన్, గుజరాత్‌లోని మరిన్ని ప్రాంతాలకు, 1989 లో దక్షిణ బెంగాల్, నాగాలాండ్ లకు, 1991లో జమ్మూ కాశ్మీర్‌లోని నుబ్రా వ్యాలీ, రాజౌరి, పూంచ్ జిల్లాలకూ విస్తరించారు.[3]
దీని ప్రాథమిక ఉద్దేశం చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దురాక్రమణ చర్యను ఎదుర్కోవడం. సైనికపరంగా, చైనీయులు భారతదేశం కంటే "మెరుగ్గా" ఉన్నారనీ, యుద్ధం సంభవిస్తే చైనీయులు భారత బలగాలను అణిచివేసేందుకు ప్రయత్నించవచ్చుననే ఆలోచన అప్పట్లో ఉండేది. కాబట్టి, 1963లో, ఒక ప్రత్యేకమైన దళాన్ని సృష్టించారు. చైనీయులు భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు ఇది, సరిహద్దు జనాభాతో కలిసిపోయి, పౌర దుస్తులు ధరించి, సమాంతర పరిపాలనను నిర్వహిస్తూ, గెరిల్లా వ్యూహాలతో యుద్ధాన్ని నిర్వహిస్తుంది.[4]
2001లో, SSB ని R&AW నుండి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ చేసి, నేపాల్, భూటాన్ సరిహద్దుల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. దాని కొత్త పాత్రకు అనుగుణంగా స్పెషల్ సర్వీసెస్ బ్యూరో పేరును సశస్త్ర సీమా బల్‌గా పేరు మార్చి, దాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలోకి తెచ్చారు. ఇది కార్గిల్ యుద్ధం తర్వాత "ఒకే సరిహద్దు ఒకే దళం భావన" ద్వారా జరిగింది.
సరిహద్దు ప్రాంతాలలో తాను ప్రభుత్వపు "ఆదర స్వభావ" కోణాన్ని ప్రదర్శించినట్లూ, దీన్ని ఆయా ప్రాంతాల ప్రజలు మెచ్చుకున్నట్లూ SSB పేర్కొంది.[5]
జాతీయ భద్రతా వ్యవస్థను సంస్కరించడంపై మంత్రుల బృందం చేసిన సిఫార్సుల ప్రకారం, ఇండో-నేపాల్ సరిహద్దు (2001 జూన్) కోసం బోర్డర్ గార్డింగ్ ఫోర్స్, లీడ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (LIA) గా SSB ని ప్రకటిస్తూ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు 1751 కి.మీ.ల పొడవున్న ఇండో-నేపాల్ సరిహద్దు కాపలా బాధ్యతను అప్పగించింది. (3 జిల్లాలలో 263.7 కి.మీ.), ఉత్తర ప్రదేశ్ (7 జిల్లాలలో 599.3 కి.మీ.), బీహార్ (7 జిల్లాలలో 800.4 కి.మీ.), పశ్చిమ బెంగాల్ (1 జిల్లాలో 105.6 కి.మీ.), సిక్కిం (99 కి.మీ.). 2004 మార్చిలో, సిక్కిం (32 కి.మీ.), పశ్చిమ బెంగాల్ (2 జిల్లాల్లో 183 కి.మీ., అస్సాం (4 జిల్లాల్లో 267 కి.మీ.), అరుణాచల్ ప్రదేశ్ (2 జిల్లాల్లో 217 కి.మీ.) రాష్ట్రాలతో పాటు ఇండో-భూటాన్ సరిహద్దులో 699 కి.మీ. సరిహద్దుకు కాపలాగా ఉండే బాధ్యతను SSBకి అప్పగించారు.[3] మహిళా బెటాలియన్‌లను నియమించాలని నిర్ణయించిన మొదటి సరిహద్దు రక్షణ దళం SSB. 2014లో, భారత ప్రభుత్వం SSBలో పోరాట అధికారులుగా మహిళల నియామకాన్ని ఆమోదించింది.[6]
SSB జమ్మూ కాశ్మీర్‌లో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో కూడా నిమగ్నమై, అంతర్గత భద్రతా విధులను కూడా నిర్వహిస్తోంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఎన్నికల విధులు, శాంతిభద్రతల విధులు కూడా నిర్వర్తిస్తుంది.
SSB 2013 సంవత్సరాన్ని గోల్డెన్ జూబ్లీ సంవత్సరంగా నిర్వహించింది.
ర్యాంక్ గ్రూపు | జనరల్/ఫ్లాగ్ ఆఫీసర్లు | సీనియర్ ఆఫీసర్లు | జూనియర్ ఆఫీసర్లు | ఆఫీసర్ క్యాడెట్ | ||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
||||||||||||||||||||||||||||||||||
డైరెక్టర్ జనరల్ - |
అడిషనల్ డైరెక్టర్ జనరల్ - |
ఇన్‌స్పెక్టర్ జనరల్ - |
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ - |
కమాండెంట్ - |
సెకండ్ ఇన్ కమాండ్ - |
డిప్యూటీ కమాండెంట్ - |
అసిస్టెంట్ కమాండెంట్ - |
ర్యాంక్ గ్రూపు | జూనియర్ నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు | నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు | ఎన్‌లిస్టెడ్ | |||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
ఇన్‌సిగ్నియా ఏమీ లేదు | ||||||||||||||||||||||||||||
సుబేదార్ మేజర్ सूबेदार मेजर |
ఇన్‌స్పెక్టర్ - |
సబ్ ఇన్‌స్పెక్టర్ - |
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ - |
హెడ్ కానిస్టేబులు - |
నాయక్ नायक |
లాన్స్ నాయక్ लांस नायक |
కానిస్టేబులు - |
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)