సాక్షి మార్చి 24, 2008న 23 ఎడిషనులతో ప్రారంభించబడింది. అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. తెలుగు దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ రంగులలో ముద్రణ చేయబడుతోంది. తొలిగా ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడింది. ఆదివారం అనుబంధం ఫన్‌డే పేరుతో విడుదల అవుతుంది. దీనిలో కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.
తొలిదశలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రధాన సంపాదకుడు. సజ్జల రామకృష్ణారెడ్డి సంపాదకీయ సంచాలకునిగా, కె.ఎన్.వై.పతంజలి వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో వర్ధెల్లి మురళి సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు. [1] ప్రస్తుతం(2019) సంపాదకీయ సంచాలకుడుగా కె రామచంద్రమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ఎబిసి 2018 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, పత్రిక సగటున 10,91,079 పత్రిక అమ్మకాలు కలిగివుంది.[2] అంతకు ముందు అర్ధసంవత్సరపు గణాంకాలతో పోల్చితే 1.7% తగ్గుదల కనబడింది.
ఐఆర్ఎస్ 2019 రెండవ త్రైమాసికం గణాంకాల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో రోజువారి సగటున పత్రిక చదివేవారి సంఖ్య 30,86,000 వుండగా, గత నెలలో ఏనాడైనా పత్రిక చదివిన వారి సంఖ్య 85,98,000 గా వుంది. గత త్రైమాసికంతో పోల్చితే రోజు వారి సగటు చదువరుల సంఖ్య 4.7% పెరిగింది.[3]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన జగన్మోహన రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల యాజమాన్యంలోని సంస్థ నియంత్రణలో పత్రిక వుండుటవలన పత్రిక నిప్షాక్షిత సందేహాస్పదం. ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్టీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత. అంతే కాకుండా స్వంత పార్టీ గురించి ఎటువంటి విమర్శనాత్మక వార్తలూ ప్రచురించకపోవడం కూడా పత్రిక విలువను అనుమానాస్పదం చేస్తోంది.[4]
<ref>
ట్యాగు; ABC2018H1
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు