సాబిత్రి ఛటర్జీ | |
---|---|
![]() 2014 మార్చి 31న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వేడుకలో ప్రణబ్ ముఖర్జీ నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్న సాబిత్రి ఛటర్జీ | |
జననం | కొమిల్లా, బ్రిటీష్ ఇండియా, (ప్రస్తుత బంగ్లాదేశ్) | 1937 ఫిబ్రవరి 22
వృత్తి | నటి |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | బిఎఫ్‌జెఏ సంగీత నాటక అకాడమీ అవార్డు బంగా బిభూషణ్ పద్మశ్రీ |
సాబిత్రి ఛటర్జీ, (జననం 22 ఫిబ్రవరి 1937[1]) బెంగాలీ నాటక, సినిమా నటి. 60 ఏళ్ళకు పైగా నటనారంగంలో ఉంది. రెండుసార్లు బిఎఫ్‌జెఏ అవార్డులను అందుకున్నది. బెంగాలీ నాటకరంగంలో సాబిత్రి చేసిన కృషికి 1999లో సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వచ్చింది. 2013లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం బంగా బిభూషణ్ పురస్కారం అందించింది. 2014లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.[2]
సాబిత్రి 1937లో ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని కొమిల్లా జిల్లాలోని కమలాపూర్‌లోని ఒక చిన్న పట్టణంలో జన్మించింది. పదిమంది సోదరీమణులలో సాబిత్రీ చిన్నది. బిక్రమ్‌పూర్‌లోని కనక్సర్ అనే కులిన్ బ్రాహ్మణ గ్రామానికి చెందిన ప్రసిద్ధ కులిన్ రార్హి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె తండ్రి శశధర్ ఛటర్జీ భారతీయ రైల్వేలో స్టేషన్ మాస్టర్‌గా పనిచేశాడు. బెంగాల్ విభజన సమయంలో, సాబిత్రి కోల్‌కతాలోని సినిమా నిర్మాణ కేంద్రమైన టోలీగంజ్‌లో ఉన్న తన సోదరి ఇంటికి పంపబడింది. టోలీగంజ్‌లో పెరగడం వల్ల ఆనాటి సినీనటులను చూసే అవకాశం వచ్చింది.[1][3]
సాబిత్రి ఛటర్జీ పదవ తరగతి చదువుతున్నప్పుడు, తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులపై ఉత్తర సారథి గ్రూప్ థియేటర్ కు కను బెనర్జీ దర్శకత్వం వహించిన నాతున్ ఇహుడిలో అనే నాటకంలో నటించింది. ఈ నాటకాన్ని 1953లో సినిమాగా తీసినపుడు అందులో సాబిత్రి కూడా నటించింది.[1] 1951లో అగ్రదూత్ దర్శకత్వంలో ఉత్తమ్ కుమార్ నటించిన సహజాత్రి సినిమాలో నటించి గుర్తింపు పొందింది. 1952లో సుధీర్ ముఖర్జీ తీసిన పషర్ బారి సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది.[1]