ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°03′11″N 82°10′12″E / 17.053°N 82.17°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండల కేంద్రం | సామర్లకోట |
విస్తీర్ణం | |
• మొత్తం | 147 కి.మీ2 (57 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,37,979 |
• జనసాంద్రత | 940/కి.మీ2 (2,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1010 |
సామర్లకోట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన మండలం.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండలంలో నిర్జన గ్రామాలు లేవు. [3] OSM గతిశీల పటం
2011 భారత జనాభా లెక్కల ప్రకారం సామర్లకోట మండలం మొత్తం జనాభా 137,979. వీరిలో 68,663 మంది పురుషులు కాగా, 69,316 మంది స్త్రీలు. 2011 లెక్కలు ప్రకారం సామర్లకోట మండల పరధిలో మొత్తం 38,889 కుటుంబాలు ఉన్నాయి. [4]మండలం సగటు లింగ నిష్పత్తి 1,010. మొత్తం జనాభాలో 41.2% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 58.8% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 74.6% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 65.8% ఉంది.మండలం పరధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 14170, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 7205, ఆడ పిల్లలు 6965 మంది ఉన్నారు. మండలం బాలల లింగ నిష్పత్తి 967, ఇది సామర్లకోట మండలం సగటు లింగ నిష్పత్తి (1,010) కంటే తక్కువ.మండల మొత్తం అక్షరాస్యత రేటు 69.39%. పురుషుల అక్షరాస్యత రేటు 64.9%, స్త్రీల అక్షరాస్యత రేటు 59.66%.[4]
సామర్లకోట :ఈ పట్టణం 31 వార్డులతో పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.సామర్లకోట పురపాలక సంఘం పట్టణ పరిధిలో 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 56864, అందులో పురుషులు 28115 మంది కాగా, స్త్రీలు 28749 మంది ఉన్నారు.[5]