సి. ఉమామహేశ్వరరావు | |
---|---|
జననం | 1952 జనవరి 24 |
వృత్తి | సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత |
జీవిత భాగస్వామి | దుర్గా భవానీ |
పిల్లలు | నందన్ బాబు, ఆనంద్ బాబు, ప్రమోద్ బాబు, వినోద్ బాబు. |
సి. ఉమామహేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత. మళయాలం, హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించాడు. దూరదర్శన్ కోసం కొన్ని టెలివిజన్ ధారావాహికలకు స్క్రిప్ట్, దర్శకత్వం వహించాడు.[1] రెండు నంది అవార్డులు, ఒక జాతీయ చలనచిత్ర అవార్డును పొందాడు.
ఉమామహేశ్వరరావు 1952 జనవరి 24న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించాడు.[2]
చిన్నతనం నుండి పుస్తకాలను చదవడంతో సాహిత్యం, ప్రదర్శన కళలవైపు ఆసక్తి కనపరిచాడు. తొలిరోజుల్లో తెలుగులో కవిత్వం, చిన్న కథలు వ్రాసాడు. కొన్ని నాటకాలు కూడా రాశాడు.
1986లో 'పూలపల్లకి’ సినిమాతో దర్శకుడయ్యాడు. ఆ తరువాత 'పదండి ముందుకు' అనే సినిమా తీశాడు. 1992లో తీసిన అంకురం సినిమా మానవ హక్కులు, పౌర హక్కులపై వచ్చిన మొదటి సినిమాగా తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డు, ఉత్తమ దర్శకుడుగా నంది అవార్డులు అందుకుంది. అరవింద స్వామి హీరో, నిర్మాతగా 'మౌనం' అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో నగ్మా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తమిళంలో 'మౌన యుద్ధం'గానూ, హిందీలో 'మౌన్'గానూ విడుదలయింది. 1996లో తీసిన శ్రీకారం అనే సినిమా ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డును పొందింది. మమ్ముట్టి, సుమన్, నగ్మాతో 'సూర్యపుత్రులు' తీశాడు.
'స్త్రీ' (డాక్యుమెంటరీ), 'హిమబిందు', 'మిస్టర్' వంటి చాలా ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్స్ తీశాడు. ఊర్ ఫిల్మ్స్ వారికోసం ఫిల్మ్ మేకింగ్ గురించి 2015లో 'ఫిలిం ఈస్తటిక్స్' పేరుతో 15 టెలిఫిల్మ్స్ చేసాడు. అవి 10టీవీలో ప్రసారమవడంతోపాటు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి అవగాహన కల్పించడం కోసం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడుతున్నాయి. 'ఇట్లు అమ్మ సినిమా' జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో 76 అవార్డులు గెలుచుకుంది.[3]
కె.వి.రెడ్డి అవార్డు - ఉత్తమ దర్శకుడు - అంకురం (1992)
క్రమసంఖ్య | సినిమా పేరు | సంవత్సరం | భాష | విభాగం | ||
---|---|---|---|---|---|---|
దర్శకత్వం | స్క్రిప్ట్ రైటింగ్ | కథ | ||||
1 | పూల పల్లకి | 1986 | తెలుగు | అవును | అవును | |
2 | పదండి ముందుకు | 1987 | తెలుగు | అవును | అవును | |
3 | అంకురం | 1992 | తెలుగు | అవును | అవును | అవును |
4 | సింధూర | 1992 | మలయాళం | అవును | అవును | |
5 | మౌనం | 1995 | తెలుగు | అవును | అవును | అవును |
6 | మౌన్ | 1996 | హిందీ | అవును | అవును | |
7 | శ్రీకారం | 1996 | తెలుగు | అవును | అవును | అవును |
8 | సూర్యపుత్రులు | 1996 | తెలుగు | అవును | అవును | అవును |
10 | అవునా | 2003 | తెలుగు | అవును | అవును | అవును |
11 | ఇట్లు అమ్మ | 2021 (సోనీ లీవ్ లో విడుదల చేయబడింది) | తెలుగు | అవును | అవును | అవును |
అనేక డాక్యుమెంటరీలు తీశాడు, వాటిలో ఒకటి:
ఎడ్యుకేషనల్ ఫిల్మ్స్