సింధు భైరవి | |
---|---|
దర్శకత్వం | కె. బాలచందర్ |
రచన | కె. బాలచందర్ |
నిర్మాత | రాజం బాలచందర్ పుష్ప కందస్వామి |
తారాగణం | శివకుమార్ సుహాసిని సులక్షణ |
ఛాయాగ్రహణం | ఆర్. రఘునాథ రెడ్డి |
కూర్పు | గణేష్-కుమార్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | కవితలయ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 11 నవంబరు 1985 |
సినిమా నిడివి | 159 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తమిళం |
సింధు భైరవి, 1985 నవంబరు 11న విడుదలైన తమిళ సినిమా. కె. బాలచందర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో శివకుమార్, సుహాసిని, సులక్షణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం స్వరపరిచాడు. ఈ సినిమాలోని పాటలను కె. జె. ఏసుదాసు, కె. ఎస్. చిత్ర పాడారు. విమర్శకుల నుండి సానుకూల సమీక్షలు వచ్చాయి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది.[1] ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి, జాతీయ ఉత్తమ సంగీత దర్శకత్వం, జాతీయ ఉత్తమ నేపథ్య గాయని విభాగాల్లో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమా సీక్వెల్ బాలచందర్ నిర్మించిన సహానా అనే టెలివిజన్ సిరీస్ ఫార్మాట్‌లో ఉంది.[2] తెలుగులో కూడా ఇదే పేరుతో విడుదలయింది.
ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాడు.[3] నేపథ్య గాయని కె.ఎస్. చిత్రకు మంచి పేరు వచ్చింది.[4] పాడలేను పల్లవైన భాషరాని దానను అనే పాట తమిళ మాతృకకు మొదటి జాతీయ అవార్డు వచ్చింది. ఇళయరాజాకు ఉత్తమ సంగీత దర్శకత్వం కోసం జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది.[5][6][7]
1986 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు