సింధురాజా | |
---|---|
Kumara-Narayana, Nava-Sahasanka | |
King of Malwa | |
పరిపాలన | c. 990s |
పూర్వాధికారి | Vakpati Munja |
ఉత్తరాధికారి | Bhoja |
వంశము | Bhoja |
రాజవంశం | Paramara |
సింధురాజా పరామరా రాజవంశం నుండి వచ్చిన ఒక భారతీయ రాజు. ఆయన 10 వ శతాబ్దం చివరిలో మాళ్వా ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆయన అన్న ముంజా, ఆయన తండ్రి భోజుడు.
సింధురాజ జారీ చేసిన శాసనాలు కనుగొనబడలేదు. భోజుడి శాసనాలతో అనేక తరువాత పరమారా శాసనాలలో ఆయన జీవితం గురించి పేర్కొనబడింది. చాలా సమాచారం ఆయన ఆస్థాన కవి పద్మగుప్తుడు వ్రాసిన నవ-సహసంక-చరితలో ఆయన గురించి పేర్కొనబడింది. కె.సి జైను ఈ రచన చరిత్ర, పురాణకథనాల కలయికగా ఉంది.[1]
సింధురాజా తన సోదరుడు ముంజా తరువాత పరామరా రాజుగా వచ్చాడు. 14 వ శతాబ్దపు కవి మేరుతుంగా ప్రబంధ-చింతామణి అభిప్రాయం ఆధారంగా సింధురాజా సింహదంతభట్ట (సియాకా)స్వంత కుమారుడని ముంజా దత్తత సంతానం అని పేర్కొన్నది. ఏదేమైనా చరిత్రకారులు ఈ వాదన ప్రామాణికతను అనుమానిస్తున్నారు.[2] ముంజా తరువాత సింధురాజా కుమారుడు భోజుడు వచ్చాడని మేరుతుంగా పేర్కొన్నాడు. ఏదేమైనా నవ-సహసంకా-చరిత, ఎపిగ్రాఫికు సాక్ష్యాల ఆధారంగా సింధురాజా ముంజా వారసుడని భావిస్తున్నారు.[3]
సింధురాజ "కుమార-నారాయణ", "నవ-సహసంకా" అనే బిరుదులను స్వీకరించారు. పద్మగుప్తుడు అవంతీశ్వర (అవంతి ప్రభువు), మాళవ-రాజా (మాలావా రాజు), పరమమహిభృతా అనే బిరుదులను కూడా ఉపయోగిస్తారు.[4] అతని ఇతర పేర్లు సింధులా, సింధాలా.[5]ఆయన వారసుడు భోజుడి శాసనాలలో ఆయనను "సింధు-రాజా-దేవా" అని పిలుస్తారు.[6]
సింధురాజా పాలన కచ్చితమైన కాలం గురించిన ఆధారాలు లేవు. ఆయన పూర్వీకుడు ముంజా క్రీ.పూ. 994, క్రీ.పూ 998 మధ్య కొంతకాలం మరణించాడు.[7]
మోడసా రాగి ఫలకాలు (సా.శ.1010) ఆయన వారసుడు భోజుడు పాలన తొలి చారిత్రక నమోదిత ఆధారాలుగా భావించబడుతున్నాయి. చింతామణి-సర్నికా (సా.శ. 1055) ను భోజుడి ఆస్థానకవి దాసబాల స్వరపరిచారు.[8] దీని ఆధారంగా ప్రతిపాలు భాటియా వంటి పండితులు భోజుడి పాలనను సా.శ.1010-1055 వరకు సింధురాజా పాలనను సా.శ. 997-1010 వరకు కేటాయించారు. అయితే భోజుడు 55 సంవత్సరాలు పాలించినట్లు మేరుతుంగ ప్రబంధ-చింతామణి పేర్కొంది. ఈ సమాచారం సరైనదని ఊహిస్తే కైలాషు చంద్ర జైను వంటి పరిశోధకులు భోజుడి పాలనను సా.శ. 1000–1055, సింధురాజా పాలన సా.శ.995-1000 గా భావిస్తారు.[3]
పరామరా ఆస్థానకవి ధనపాల రచించిన తిలక-మంజరి, సింధురాజను గొప్ప కథానాయకుడు, "ఇంద్రుని ఏనుగులను జయించగలిగిన సింహం" అని ప్రశంసించారు. [9] సింధురాజ కుంతల రాజును ఓడించాడని నవ-సహసంక-చరిత అలాగే తరువాతి పరామరా రాజు ప్రభుత్వ ఉదయపూరు ప్రశస్తి శాసనం పేర్కొన్నది. పరామరా రాజ్యం దక్షిణ సరిహద్దులోని భూభాగాలను ఆయన తిరిగి స్వాధీనం చేసుకున్నాడని ఇది సూచిస్తుంది. ఆయన పూర్వీకుడు ముంజా కల్యాణి చాళుక్య రాజు రెండవ తైలాపా చేతిలో ఓడిపోయాడు. అయితే తైలాపా వారసుడు సత్యాశ్రయతో సింధురాజా పోరాడాడా అనేది స్పష్టంగా తెలియదు.[4]
నాగ-సహసంకా-చరిత సింధురాజు నాగ యువరాణి శశిప్రభా గెలిచుకోవడానికి రాక్షస రాజు వజ్రాంకుశను ఓడించినట్లు పాక్షిక-పౌరాణిక కథనం వివరిస్తుంది; ఈ పోరాటంలో ఆయనకు విద్యాధర నాయకుడు శశిఖండ మద్దతు ఇచ్చాడు. చరిత్రకారుడు వి.ఎస్. పాథకు, శశిఖండ ఉత్తర శిలహర రాజు అపరాజితకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, వజ్రాంకుశ దక్షిణ శిలహర రాజు రత్తరాజాకు ప్రాతినిధ్యం వహించాడని భావించారు. [10] నాగాలు కరాహట (ఆధునిక కరాడు) సిండా రాజవంశానికి ప్రాతినిధ్యం వహించాయని పాథకు అభిప్రాయపడ్డాడు.[11] ఇది పౌరాణిక నాగాల ఆధారంగా స్వీకరించబడిందని పేర్కొంది. [12]
ఈ కథనం సింధురాజకు హ్యూణులు, వాగడ, మురాలా, లతా, అపరాంత, కోసల దేశాలతో సహా అనేక ఇతర విజయాలు సాధించిన ఘనత ఇచ్చింది:[4]
గుజరాతులోని చాళుక్య రాజవంశం సా.శ. 1151 వాడ్నగరు ప్రశాస్తి శాసనం ఆధారంగా వారి రాజు చాముండరాజా సింధురాజా మీద సైన్యాన్ని నడిపించాడు. శాసనం ప్రకారం సింధురాజా చాముండరాజు సైన్యాన్ని దూరం నుండి చూసినప్పుడు ఆయన తన ఏనుగు దళాలతో పారిపోయి అప్పటివరకు బాగా స్థిరంగా ఉన్న కీర్తిని కోల్పోయాడు.[14] లతా పాలకుడు చముండరాజకు సామంతుడు అని తెలుస్తుంది. సింధురాజ లత మీద దాడి చేయడం చాముండరాజును స్వీయ రక్షణకు ప్రేరేపించింది. 14 వ శతాబ్దపు రచన కుమారపాల-చరిత చముండరాజు సింధురాజను యుద్ధంలో చంపాడని పేర్కొంది. ఈ రచనను జైన రచయిత జయసింహ సూరి రాశాడు. ఆయనను గుజరాతు చాళుక్యులు పోషించారు. ఏదేమైనా ఈ వాదన చారిత్రాత్మకత సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇది మునుపటి మూలాల్లో కనిపించదు.[15][13]
కచ్చపాఘాట పాలకుడు మహిపాల సా.శ. 1092 సాసుబహు ఆలయ శాసనం ఆధారంగా ఆయన పూర్వీకుడు కీర్తిరాజా మాళవ యువరాజును ఓడించాడు. ఆయన సైనికులు యుద్ధభూమి నుండి పారిపోయి వారి ఈటెలను విడిచిపెట్టారు. మునుపటి పరిశోధకులు పరాజయం పాలైన రాజును సింధురాజా కుమారుడు, వారసుడు భోజుడిగా గుర్తించారు. కాని ఈ రాజు సింధురాజా అయి ఉండవచ్చని చాలా అధికంగా భావిస్తున్నారు. తెలుస్తుంది.[13]