సింహిక | |
---|---|
![]() హనుమంతుడు సురస, సింహికను ఎదుర్కోవడం. | |
అనుబంధం | రాక్షసి |
పాఠ్యగ్రంథాలు | రామాయణం |
సింహిక హిందూ పురాణాల్లో ఒక రాక్షసి. రామాయణంలో సుందర కాండలో ఈమె గురించి ప్రస్తావన ఉంటుంది. ఈమె హనుమంతుని చేతిలో మరణించింది.[1]
శ్రీరాముని భార్య సీతను వనవాసంలో ఉండగా రావణాసురుడు అపహరిస్తాడు. ఆమెను వెతుకుతూ రామలక్ష్మణుడు సుగ్రీవాది వానరసేనను, హనుమంతుని కలుస్తారు. రాముడు సుగ్రీవుని పీడిస్తున్న అతని అన్న వాలిని వధించి ప్రతిగా సీతను వెతకడంలో సహాయం చేయమని కోరతాడు. హనుమంతుడు లంకలో ఉన్న సీతను వెతకడానికి సముద్రాన్ని దాటి వెళుతుండగా మొదట పర్వతరాజు మైనాకుడు అతన్ని అడ్డగిస్తాడు. అతని ఆతిథ్యాన్ని స్వీకరించి హనుమ మరింత ముందుకు వెళతాడు. తర్వాత దేవతలు హనుమ యుక్తిని పరిశీలించడానికి పంపిన సురసను దాటి ముందుకు వెళతాడు. తర్వాత సింహిక సముద్ర నదీజలాల్లో దాగి హనుమంతుని నీడ పసిగడుతుంది. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు శరీరాలు పెంచుకోగా, హనుమంతుడు వెంటనే తగ్గి ఆమె నోటిగుండా ప్రవేశించి చీల్చి చంపుతాడు. తర్వాత తన లంకా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.[2][3]