క్లాక్ టవర్ | |
అక్షాంశ,రేఖాంశాలు | 17°26′27″N 78°29′55″E / 17.4408°N 78.4985°E |
---|---|
ప్రదేశం | సికింద్రాబాదు, తెలంగాణ |
రూపకర్త | నిజాం |
రకం | విక్టరి కాలమ్ |
ఎత్తు | 120 అడుగులు[1] |
ప్రారంభ తేదీ | 1 ఫిబ్రవరి, 1897 |
అంకితం చేయబడినది | సికింద్రాబాద్ కంటోన్మెంట్ వద్ద ఉన్న బ్రిటీష్ అధికారులకు |
సికింద్రాబాద్ క్లాక్ టవర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సమీపంలోని సికింద్రాబాదులో ఉన్న టవర్. బ్రిటీష్ కంటోన్మెంట్ ప్రగతికి చిహ్నంగా 1860లో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టవర్ 1897, ఫిబ్రవరి 1న ప్రారంభించబడింది.[2]
1806వ సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందంలో భాగంగా హుస్సేన్ సాగర్ అవతల ఏర్పాటుచేయబడిన ఆంగ్లేయుల స్థావరం నిజాం పాలకుడు సికిందర్ జాహ్ ఉత్తర్వులతో సికింద్రాబాదుగా ఆవిర్బవించింది.[3] హైదరాబాదులోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ వద్ద ఉన్న బ్రిటీష్ అధికారులు సాధించిన పురోగతిని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1860లో 10 ఎకరాల (4.0 హెక్టారులు) భూమిని ఇచ్చింది.[4] 1896లో 2.5 ఎకరాల (1.0 హెక్టార్లు) పార్కులో 120 అడుగుల ఎత్తైన క్లాక్ టవర్ నిర్మించబడింది.[1] సర్ ట్రెవర్ జాన్ చిచెల్ ప్లోడెన్ 1897, ఫిబ్రవరి 1న ప్రారంభించారు. టవర్ మీద ఉన్న గడియారంను వ్యాపారవేత్త దివాన్ బహదూర్ సేఠ్ లక్ష్మీనారాయణ రాంగోపాల్ విరాళంగా ఇచ్చారు.[3]
హైదరాబాద్-సికింద్రాబాద్ యొక్క జంట నగరాల్లో ఈ టవర్ వారసత్వ నిర్మాణంగా ప్రకటించబడింది.[4] పౌర సంస్థ చేపట్టిన ప్రయత్నాల ఫలితంగా యునెస్కో ఈ టవర్ కు వారసత్వ కట్టడంగా హోదా ఇచ్చింది.[5]