సియెర్రా లియోన్ లోని హిందువులు ప్రధానంగా దక్షిణాసియా సంతతికి చెందినవారు. సాధారణంగా వీరు వ్యాపారులు. [1] [2] ARDA ప్రకారం 2015 సంవత్సరంలో సియెర్రా లియోన్‌లో 3,550 మంది హిందువులు (0.05%) ఉన్నారు. [3]
ఫ్రీటౌన్, సియెర్రా లియోన్ రాజధాని, ప్రధాన నగరం, ఇక్కడ ఒక పూజారితో సహా పెద్ద హిందూ సమాజం ఉంది. ఫ్రీటౌన్‌లో హిందువులకు దహన సంస్కారాలకు అనుమతి ఉంది. [4]
సియెర్రా లియోన్ అంతర్యుద్ధం సమయంలో 1999లో ప్రవాసుల వలసల తరువాత, భారతీయ సంఘం సంఖ్య దాదాపు 1500కి తగ్గిపోయింది. హిందువుల్లో ఎక్కువ మంది సింధీ మూలానికి చెందిన వ్యాపారవేత్తలు. [5]
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
2001 | 4,750 | — |
2007 | 1,942 | −59.1% |
2015 | 3,550 | +82.8% |
సంవత్సరం | శాతం | మార్పు |
---|---|---|
2001 | 0.1% | - |
2007 | 0.04% | -0.6 |
2015 | 0.05% | +0.01 |
2001 నాటికి దేశంలో 4,750 మంది హిందువులు (0.1%) ఉన్నారు, 2007 నాటికి ఈ సంఖ్య 1,942 (0.04%) కు తగ్గింది, 2015లో 3,550 (0.05%) కి పెరిగింది. [6] [7] [8]
ఫ్రీటౌన్‌లో ఒక హిందూ దేవాలయం ఉంది. [9] ఇది స్థానిక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తుంది. [10]