ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
Siroi Lily | |
---|---|
Siroi lily growing in its native habitat, the Shirui Hill, Ukhrul, Manipur. | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | L. mackliniae
|
Binomial name | |
Lilium mackliniae |
సిరోయ్ లిల్లీ అనే అందమైన లిల్లీ పువ్వు మణిపూర్ ఉఖ్రుల్ జిల్లా సిరోయి కొండలలో మాత్రమే కనిపిస్తుంది. సిరోయ్ లిల్లీ పువ్వు, లిలియేసి కుటుంబానికి చెందినది. జీన్ కింగ్డన్ వార్డ్ (నీ మాక్లిన్) 1949 లో, లిలియం మాక్లినియా పర్వతంపై కనుగొనబడింది. ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ లోని సిర్హోయ్. 1948 వ సంవత్సరం లో ఫ్రాంక్ కింగ్డన్ వార్డ్, అతని భార్యజీన్ మొదట సిరోయ లిల్లీ పువ్వను పెంచాలా చేసింది. మణిపూర్ లోని సిరోయ్ అటవీ ప్రాంతం లో ఉండేవారు . మొదట వాళ్ళు దీని మొక్కను చూడటం ,విత్తనాలను వేయడం వంటివి చేసారు . అందుకే వారి గౌరవార్థం మాక్లిన్ అనే పేరుపెట్టారు [1]
భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రానికి చెందినది మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్,నాగాలాండ్, సిరోయ్ లిల్లీ (లిలియం మాక్లినియా) వాణిజ్యపరంగా పండిస్తారు. దీని లోని కొన్నిరకాలు అలాస్కా, బీట్రిక్స్, కనెక్టికట్ కింగ్,కార్డెలియా, ఎలైట్, పారిస్, మెంటన్, మాసా, మోనాలిసా,ఆరెంజ్ మౌంటైన్, ఎల్లో జెయింట్, కాసా బ్లాంకా, టైబర్ మొదలైనవి . నర్సరీ పెంపకం లో నేల మట్టానికి 15 సెం.మీ , 6-8 సెం.మీ లోతులో వేస్తారు. కావలిసిన ఉష్ణోగ్రత 21 డిగ్రీల నుండి 25 డిగ్రీల లో పెరుగుతాయి. సిరోయ్ లిల్లీ పూవులు గులాబీ , పసుపు , ఆరెంజ్ రంగులలో ఉంటాయి [2] సిరోయ్ లిల్లీ పూవును మణిపూర్ రాష్ట్రము "రాష్ట్ర పుష్పంగా " ప్రకటించారు (21 మార్చి, 1989 ) . దురదృష్టవశాత్తు భారతదేశంలో సిరోయ్ లిల్లీ పువ్వు అంతరించిపోతున్న జాతు లలో ఒకటి. ఇండో-బర్మా జీవవైవిధ్యంలో ఉన్న ఈశాన్య ప్రాంతం. ఇక్కడ పూర్తిగా అన్వేషించబడలేదు , అధ్యయనం చేయబడలేదు కొన్ని లోపాలతో ఈ మొక్కల జన్యు వనరులు క్షీణిస్తున్నాయి. ఇందుకు కారణములు చూస్తే ప్ర తి సంవత్సరం వేలాది సిరుయి కొండలపైకి వచ్చే పర్యాటకులు ప్రధానముగా మొక్క పుష్పించే కాలంలో , రావడం , వీటి మధ్యలలో నడవడం, ప్రతికూలంగా ప్రభావితం చేసింది. పర్యాటకులు వేసే వ్యర్థ పదార్థములు, ప్లాస్టిక్ల వేయడం వంటి వాళ్ళ సిరోయ్ లిల్లీ జాతులు అంతరించి పోవడానికి ఒక కారణముగా భావించ వచ్చును. మరియొక కారణం అడవిలో మంటలు రావడం దీనితో మొక్కలు , విత్తనములు కాలిపోవడం వాళ్ళ కూడా సిరోయ్ లిల్లీ పువ్వు అంతరిస్తుందని చెప్పవచ్చును [3] అంతరిస్తున్న సిరోయ్ లిల్లీ పువ్వును గుర్తించి ప్రభుత్వం వారు ,1982 లో ఈ ప్రదేశాన్ని జాతీయ ఉద్యానవనం - సిరోయి నేషనల్ పార్క్ గా ప్రకటించారు [4]
దీని ప్రాముఖ్యత గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు 2000 సంవ్సతరం లో పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసారు [5]
{{cite web}}
: CS1 maint: url-status (link)