సీ.ఎం.రమేష్ | |||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 3 ఏప్రిల్ 2018 – 2 ఏప్రిల్ 2024 | |||
తరువాత | మేడా రఘునాథ్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఆంధ్రప్రదేశ్ | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2 మే 2014 – 2 ఏప్రిల్ 2018 | |||
ముందు | తూళ్ల దేవేందర్ గౌడ్ | ||
తరువాత | జోగినపల్లి సంతోష్ కుమార్ | ||
నియోజకవర్గం | తెలంగాణ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ (2019 వరకు) | ||
జీవిత భాగస్వామి | శ్రీదేవి రమేష్ | ||
సంతానం | రిత్విక్,రిత్విన్ | ||
నివాసం | హైదరాబాద్ కడప | ||
వెబ్‌సైటు | [1] |
చింతకుంట మునుస్వామి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు ఆయన 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[1]
సీ.ఎం.రమేష్ 1985లో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు చిత్తూరు జిల్లా ప్రచార కార్యదర్శిగా, ఎన్నికల పర్యవేక్షణ కమిటీ సభ్యునిగా వివిధ హోదాలలో పని చేశాడు. ఆయన 1989 ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం ఇంచార్జిగా పని చేశాడు. రమేష్ 2012లో రాజ్యసభ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నామినేట్ అయ్యాడు. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికయ్యాడు. సీ.ఎం.రమేష్ 2015లో రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) బిల్లుపై రాజ్యసభ ఎంపిక కమిటీ సభ్యుడిగా, గనులు & ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ), సవరణ బిల్లుపై రాజ్యసభ ఎంపిక కమిటీ సభ్యుడిగా, 2016లో రాజ్యాంగ (నూట ఇరవై మూడవ సవరణ) బిల్లుపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా, 2017లో మోటారు వాహనాల (సవరణ) బిల్లుపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన మార్చి 2018లో రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.[2]
సీ.ఎం.రమేష్ 2019 జూన్ 20న సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావుతో కలిసి డిల్లీలోని బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3]
ఆయన 2024లో లోక్‌సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బీజేపీ నుండి అనకాపల్లి లోక్‌సభ స్థానం పోటీ చేయనున్నాడు.[4][5][6]