సి.పి. రాధాకృష్ణన్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 31 జులై 2024[1] | |||
ముందు | రమేష్ బైస్ | ||
---|---|---|---|
పదవీ కాలం 18 ఫిబ్రవరి 2023[2] – 2024 జులై 30[3][4] | |||
ముందు | రమేష్ బైస్ | ||
తరువాత | సంతోష్ గంగ్వార్ | ||
తెలంగాణ గవర్నర్
| |||
పదవీ కాలం 20 మార్చి 2024[5] – 2024 జులై 30[6] | |||
ముందు | తమిళిసై సౌందరరాజన్ | ||
తరువాత | జిష్ణు దేవ్ వర్మ | ||
పుదుచ్చేరి గవర్నర్
| |||
పదవీ కాలం 22 మార్చి 2024[7] – 1 ఆగస్టు 2024[8] | |||
ముందు | తమిళిసై సౌందరరాజన్ | ||
తరువాత | కునియిల్ కైలాష్నాథన్ | ||
పదవీ కాలం 1998 – 2004 | |||
ముందు | ఎం. రామనాథన్ | ||
తరువాత | కె. సుబ్బరాయన్ | ||
నియోజకవర్గం | కోయంబత్తూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిరుప్పూర్, మద్రాస్, భారతదేశం | 1957 మే 4||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | ఆర్. సుమతి | ||
నివాసం | * రాజ్ భవన్, మహారాష్ట్ర (అధికారిక నివాసం) | ||
పూర్వ విద్యార్థి | వీఓ చిదంబరం కళాశాల | ||
వృత్తి | వ్యవసాయదారుడు, రాజకీయ నాయకుడు |
సీపీ రాధాకృష్ణన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా, తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. సీపీ రాధాకృష్ణన్ 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితుడయ్యాడు.[9][10]
తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్‌గా & పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలును అప్పగిస్తూ 2024 మార్చి 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది.[11] తెలంగాణ గవర్నరుగా 2024 జులై 31 వరకు (అదనపు బాధ్యత), పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా 2024 ఆగస్టు 06 వరకు పనిచేసారు.
సీపీ రాధాకృష్ణన్‌ను 2024 జూలై 27న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించగా, జూలై 27న గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశాడు.[12]
సీపీ రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998లో కోయంబత్తూరు నుంచి తొలిసారి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1999లో రెండోసారి ఎంపికై 2004, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు.
అతను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా, 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డు చైర్మన్‌గా పని చేశాడు.[13]
సంవత్సరం | ఎన్నికల | పార్టీ | నియోజకవర్గం పేరు | ఫలితం | ఓట్లు వచ్చాయి | ఓటు వాటా% | |
---|---|---|---|---|---|---|---|
1998 | 12వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | కోయంబత్తూరు | విజేత | 4,49,269 | ||
1999 | 13వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | కోయంబత్తూరు | విజేత | 4,30,068 | ||
2004 | 14వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | కోయంబత్తూరు | రన్నర్ | 3,40,476 | ||
2014 | 16వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | కోయంబత్తూరు | రన్నర్ | 3,89,701 | 33.12 | |
2019 | 17వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | కోయంబత్తూరు | రన్నర్ | 3,92,007 | 31.34 |