సీ యూ సూన్ | |
---|---|
దర్శకత్వం | మహేష్ నారాయణన్ |
రచన | మహేష్ నారాయణన్ |
కథ | మహేష్ నారాయణన్ |
నిర్మాత | ఫహాద్ ఫాజిల్ నజ్రియా నజీమ్ |
తారాగణం | ఫహాద్ ఫాజిల్ రోషన్ మ్యాథ్యూ దర్శన రాజేంద్రన్ |
ఛాయాగ్రహణం | సబిన్ ఉలికాందీ వర్చువల్ సినిమాటోగ్రఫి: మహేశ్ నారాయణన్ |
కూర్పు | మహేష్ నారాయణన్ |
సంగీతం | గోపి సుందర్ |
నిర్మాణ సంస్థ | ఫాహద్ పాజిల్ అండ్ ఫ్రెండ్స్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 1 సెప్టెంబరు 2020 |
సినిమా నిడివి | 98 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సీ యూ సూన్ మలయాళంలో 2020లో విడుదలై.. అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదలైన సినిమా. ఫహాద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించగా 1 సెప్టెంబర్ 2020న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటీలో విడుదలైంది.[1]
దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పని చేస్తున్న జిమ్మి కురియన్ (రోషన్ మ్యాథ్యూ) డేటింగ్ యాప్ ద్వారా దుబాయ్‌లోనే ఉంటున్న అను సెబాస్టియన్ (దర్శనా రాజేంద్రన్) ని ఆన్‌లైన్‌లో పరిచయమవుతుంది. తన చిన్నప్పటి ఫోటోలు, కుటుంబం ఫోటోలు అన్నీఅతనితో షేర్ చేస్తుంటుంది. జిమ్మి కురియన్, అను సెబాస్టియన్తో ప్రేమలో పడతాడు. అమెరికాలో ఉంటున్న తన తల్లికి వీడియో కాల్ ద్వారా ఆమెను పరిచయం చేస్తాడు. పెళ్లి చేసుకుందామనుకుంటున్నానని చెబుతాడు. ఈ లోపల ఆ అమ్మాయి తాను ఉన్నచోట ఇబ్బంది పడుతున్నానని, తీసుకెళ్లమని అతనికి చెబుతుంది. దాంతో ఆమె ఉంటోన్న ఏరియా నుంచి తన ఫ్లాట్‌కు తీసుకొస్తాడు. వారం తర్వాత ఆ అమ్మాయి అదృశ్యం అవుతుంది. ఈ విషయాన్నీ తన బంధువు, సైబర్ సెక్యూరిటీ ట్రాక్ చేసే కెవిన్ థామస్ (ఫాహద్ ఫాజిల్) కు చెప్పి అతడి సహాయం కోరతాడు. ఇంతకూ ఆ అమ్మాయి ఏమైంది? జిమ్మికి సమస్యను కెవిన్ ఎలా పరిష్కరించాడు?? అనేది మిగతా సినిమా కథ.[2]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)