సీతమ్మధార | |
---|---|
విశాఖపట్నం లోని ప్రాంతం | |
Coordinates: 17°44′33″N 83°18′45″E / 17.742457°N 83.312417°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
Government | |
• Type | మేయర్ -కౌన్సిల్ |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ | 530013 |
వాహన రిజిస్ట్రేషన్ కోడ్ | AP31 (పాతది) AP39 (2019 జనవరి 30 నుండి)[1] |
శాసనసభ నియోజకవర్గం | విశాఖపట్నం నార్త్ |
లోక్‌సభ నియోజకవర్గం | విశాఖపట్నం |
సీతమ్మధార విశాఖపట్నం నగరం లోని ఒక ప్రముఖ ప్రాంతం. ఈ ప్రాంతం విశాఖలోని సింహాచలం పర్వత శ్రేణి దిగువ భూమిలో నెలకొని ఉంది. ఒకపుడు కొండనుండి ప్రవహించే నీటి ధార ఆధారంగా ఈ ప్రాంతానికి సీతమ్మధార అని పేరు వచ్చిందని నానుడి.
ఈ ప్రాంతం ఇప్పుడు విశాఖ లోని ఒక ప్రాముఖ్య విద్యా, వాణిజ్య, గృహ నివాస ప్రాంతం. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ తెలుగు దినపత్రిక అయిన "ఈనాడు" ప్రథమ కార్యాలయం సీతమ్మధార లోని నక్కవానిపాలెంలో స్థాపించబడింది. ఇచ్చట ఆంగ్ల దిన పత్రిక " ది హిందూ" విశాఖ నగర కార్యాలయము కూడా నున్నది. విశాఖ నగర వాసుల నిత్యా వసరాలు తీర్చేందుకు కూరగాయల, నిత్యావసర సరుకుల బజారు ""రైతు బజార్" ఇచ్చట నెలకొల్పబడింది. విశాఖ లోని వైద్యుల నివాస ప్రాంతం "డాక్టర్స్ కాలనీ" సీతమ్మధార లోనే ఉంది.