సీతయ్య | |
---|---|
దర్శకత్వం | వై.వి.ఎస్.చౌదరి |
రచన | వై.వి.ఎస్.చౌదరి |
నిర్మాత | వై.వి.ఎస్.చౌదరి |
తారాగణం | నందమూరి హరికృష్ణ సౌందర్య సిమ్రాన్ |
ఛాయాగ్రహణం | మధు. ఏ. నాయుడు |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | బొమ్మరిల్లు వారి |
విడుదల తేదీ | 22 ఆగష్టు 2003 |
సినిమా నిడివి | 179 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సీతయ్య నందమూరి హరికృష్ణ, సౌందర్య, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 2003 నాటి సినిమా. ఈ సినిమాను వై.వి.ఎస్.చౌదరి తన "బొమ్మరిల్లు వారి" సంస్థలో నిర్మించి దర్శకత్వం వహించాడు. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా విజయం సాధించింది.[1][2]
సీతయ్య (హరి కృష్ణ) ఒక పోలీసు. రాయలసీమలోని వర్గ కక్షలను అంతం చేయాలనుకుంటాడు. ధర్మవరంలో పోరాడుతున్న రెండు వర్గాల కుటుంబాలను ఒకరినొకరు చంపుకోకుండా ఆపడానికి అతను ప్రయత్నిస్తాడు. బంగారం (సిమ్రాన్) ప్రమాదవశాత్తు సీతయ్య ఇంటికి వచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. ఇంతలో, ఈ వర్గాల వ్యక్ల్తులు సీతయ్య యొక్క గతం గురించి తెలుసుకుంటారు. సీతయ్య సమస్యలను పరిష్కరించడం, రాయలసీమలో శాంతిని తీసుకురావడం, మిగిలిన కథ.
ఎవరి మాట వినడు, రచన: సి. నారాయణ రెడ్డి, గానం. ఎం ఎం కీరవాణి
ఇదిగో రాయలసీమ గడ్డ, రచన: సి నారాయణ రెడ్డి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
రావయ్యా రావయ్యా , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎం ఎం కీరవాణి
ఒక్క మగాడు , రచన: చంద్రబోస్, గానం . ఎం ఎం కీరవాణి, అనురాధ శ్రీరామ్
సిగ్గేస్తుంది , రచన: చంద్రబోస్ , గానం శ్రేయా ఘోషల్ , ఎం ఎం కీరవాణి
బస్సెక్కి వస్తావో , రచన: చంద్రబోస్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
ఆదిశంకరుల , రచన: చంద్రబోసు, గానం.ఎస్ పి.బి చరన్ , ఉపదృష్ట సునీత
అమ్మతోడు , రచన: చంద్రబోస్, గానం.ఉదిత్ నారాయణ్, కె ఎస్ చిత్ర
సమయానికి తగు సేవలు , రచన: చంద్రబోస్, గానం.విజయ్ ఏసుదాస్ , ఉపద్రస్ట సునీత .