![]() | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Personal information | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Nationality | ![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Born | కరౌలి, రాజస్థాన్ | 1996 జనవరి 1||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Sport | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Country | ![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Sport | అథ్లెటిక్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Event | జావెలిన్ /డిస్కస్ త్రో /షాట్ ఫుట్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Coached by | మహావీర్ ప్రసాద్ సైనీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Medal record
|
సుందర్ సింగ్ గుర్జర్ భారతదేశానికి చెందిన పారా అథ్లెట్స్ క్రీడాకారుడు. ఆయన 2020 టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో కాంస్య పతకం గెలిచాడు.[1][2]
సుందర్ సింగ్ గుర్జర్ 2009 నుంచి క్రీడల్లో పాల్గొంటూ షాట్‌పుట్‌లో జాతీయస్థాయిలో పతకాలు సాధించాడు. ఆయన 2015 వరకు సాధారణ అథ్లెట్లలాగే ఉన్నాడు కానీ 2015లో తన మిత్రుడి ఇంటికి వెళ్లిన సందర్భంలో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. ఓ రేకు షెడ్డు అతడి ఎడమచేతిపై పడటంతో దాన్ని కోల్పోయాడు. ఆయన అనంతరం పారా అథ్లెట్‌గా మారిన సుందర్ మరుసటి ఏడాది జరిగిన రియో పారాలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. పారాలింపిక్స్‌కు వెళ్లిన అతడు జావెలిన్ త్రో విభాగంలో మంచి ప్రదర్శన చేస్తున్నా నిర్వాహకులు కాల్‌రూమ్‌కు పిలిచినప్పుడు 52 సెకన్లు ఆలస్యంగా వెళ్లినట్లు పేర్కొని అతనిని అనర్హుడిగా ప్రకటించారు.
సుందర్ సింగ్ గుర్జర్ 2020 టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఎఫ్46 విభాగంలో కాంస్య పతకం గెలిచాడు.[3]