సుందర్‌లాల్ పట్వా | |
---|---|
మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ (భారతదేశం) | |
In office 2000 నవంబరు 7 – 2001 సెప్టెంబరు 1 | |
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి |
అంతకు ముందు వారు | నవీన్ పట్నాయక్ |
తరువాత వారు | రామ్ విలాస్ పాశ్వాన్ |
మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ | |
In office 2000 సెప్టెంబరు 30 – 2000 నవంబరు 7 | |
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి |
అంతకు ముందు వారు | సురేష్ ప్రభు |
తరువాత వారు | సత్యబ్రత ముఖర్జీ |
వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ | |
In office 2000 మార్చి 6 – 2000 మే 26 | |
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి |
అంతకు ముందు వారు | నితీష్ కుమార్ |
తరువాత వారు | నితీష్ కుమార్ |
మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (భారతదేశం) | |
In office 1999 అక్టోబరు 13 – 2000 సెప్టెంబరు 30 | |
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి |
అంతకు ముందు వారు | బాబాగౌడ పాటిల్ |
తరువాత వారు | వెంకయ్య నాయుడు |
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ | |
In office 1999–2004 | |
అంతకు ముందు వారు | సర్తాజ్ సింగ్ |
తరువాత వారు | సర్తాజ్ సింగ్ |
నియోజకవర్గం | హోషంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం |
In office 1997–1998 | |
అంతకు ముందు వారు | అల్కా నాథ్ |
తరువాత వారు | కమల్ నాథ్ |
నియోజకవర్గం | చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం |
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి | |
In office 1990 మార్చి 5 – 1992 డిసెంబరు 15 | |
గవర్నర్ | ఎం. ఎ. ఖాన్ |
అంతకు ముందు వారు | శ్యామ చరణ్ శుక్లా |
తరువాత వారు | దిగ్విజయ్ సింగ్ |
In office 1980 జనవరి 20 – 1980 ఫిబ్రవరి 17 | |
గవర్నర్ | సి. ఎం. పూనాచ |
అంతకు ముందు వారు | వీరేంద్ర కుమార్ సఖ్లేచా |
తరువాత వారు | అర్జున్ సింగ్ |
ప్రతిపక్ష నాయకుడు మధ్యప్రదేశ్ శాసనసభ | |
In office 1980 జూలై 4 – 1985 మార్చి 10 | |
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి | అర్జున్ సింగ్ |
అంతకు ముందు వారు | అర్జున్ సింగ్ |
తరువాత వారు | కైలాష్ చంద్ర జోషి |
మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు | |
In office 1985–1997 | |
అంతకు ముందు వారు | శాలిగ్రామ్ |
తరువాత వారు | నరేష్ సింగ్ పటేల్ |
నియోజకవర్గం | భోజ్‌పూర్, మధ్యప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం |
In office 1980–1985 | |
అంతకు ముందు వారు | సబితా బాజ్‌పాయ్ |
తరువాత వారు | శంకర్ లాల్ |
నియోజకవర్గం | సెహోర్ శాసనసభ నియోజకవర్గం |
In office 1977–1980 | |
అంతకు ముందు వారు | శ్యామ్ సుందర్ పాటిదార్ |
తరువాత వారు | శ్యామ్ సుందర్ పాటిదార్ |
నియోజకవర్గం | మందసౌర్ శాసనసభ నియోజకవర్గం |
In office 1957–1967 | |
అంతకు ముందు వారు | నద్రం దాస్ |
తరువాత వారు | నియోజకవర్గం ఏర్పాటు |
నియోజకవర్గం | మానస శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కుక్రేశ్వర్, సెంట్రల్ ప్రావిన్సులు, బెరార్, బ్రిటిష్ ఇండియా | 1924 నవంబరు 11
మరణం | 2016 డిసెంబరు 28 భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం | (వయసు 92)
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
సుందర్ లాల్ పట్వా (1924 నవంబరు 11 - 2016 డిసెంబరు 28) భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ 11వ ముఖ్యమంత్రిగా, భారత ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు.
ఆయనకు భారత ప్రభుత్వం 2017లో మరణానంతరం రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ అందించింది.[1][2]
ఆయన మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో మానస, రాంపుర మధ్య ఉన్న కుక్రేశ్వర్ గ్రామంలో జన్మించాడు.
ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యుడు. 1997లో ఛింద్వారా నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా కాంగ్రెస్ బలమైన వ్యక్తి కమల్ నాథ్‌ను ఓడించిన ఏకైక రాజకీయ నాయకుడు.
రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన మొదటిసారి జనతాపార్టీ నుంచి నెల రోజులకన్నా తక్కువకాలం (1980 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 17 వరకు) ఉన్నాడు. ఇక రెండోసారి భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా 1990 మార్చి 5 నుంచి 1992 డిసెంబరు 15 వరకు సేవలందించాడు.
ఆయన రాజకీయ ప్రస్థానం భారతీయ జనసంఘ్‌తో ప్రారంభమైంది. అయితే ఈ పార్టీ 1977లో జనతా పార్టీలో విలీనమైంది.
ఆయన ఇద్దరు మేనల్లుళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చారు.[3] సురేంద్ర పట్వా మొదటిసారిగా భోజ్‌పూర్ నుండి మధ్యప్రదేశ్ విధానసభకు 2008లో ఎన్నికయ్యాడు. ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు.
ఆయన మరో మేనల్లుడు మంగళ్ పట్వా (1965-2015) 1998లో మానస స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. బీజేపీ నీముచ్ జిల్లా విభాగానికి అధ్యక్షుడయ్యాడు. మంగళ్ పట్వా 2015లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
92 ఏళ్ల సుందర్‌లాల్ పట్వా గుండె సంబంధ సమస్యతో బాధపడుతూ 2016 డిసెంబరు 28న కన్నుమూసాడు.[4]