సుకుమారుడు | |
---|---|
దర్శకత్వం | జి. అశోక్ |
నిర్మాత | కె. వేణుగోపాల్ |
తారాగణం | ఆది నిషా అగర్వాల్ ఘట్టమనేని కృష్ణ శారద చంద్రమోహన్[1] |
ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సౌదామిని క్రియేషన్స్ |
విడుదల తేదీ | మార్చి 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సుకుమారుడు 2013 లో జి. అశోక్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో ఆది, నిషా అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర ముఖ్యమైన పాత్రల్లో శారద, కృష్ణ, రావు రమేష్, గొల్లపూడి మారుతీ రావు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
సుకుమార్ (ఆది) కెరీర్లో సక్సెస్ అయిన పక్కా మనీ మైండెడ్ మనస్తత్వం గల వ్యక్తి. తన డ్రీం ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి తనకి త్వరగా కొంత డబ్బు అవసరం అవుతుంది. అదే సమయంలో తనకు వారి పల్లెటూరిలో వారసత్వంగా 150 కోట్ల ఆస్తి వస్తుందని తెలుస్తుంది. అతను ఆ ఆస్తి కోసం పల్లెటూరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అక్కడకు వెళ్లి తన న అమ్మమ్మ వర్ధనమ్మ (శారద)ను కలుసుకుంటాడు. ఆ గ్రామస్తులందరూ ఆమెని ఎంతో గౌరవిస్తూ వుంటారు. సుకుమార్ ఆస్తి కోసం ఆమెను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతని పథకాలని తన మామయ్య రావు రమేష్, అతని బృందం అడ్డుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో శంకరి (నిషా అగర్వాల్), సుకుమార్ ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు జరుగుతూ వుంటాయి. తన ప్లాన్ లో సుకుమార్ విజయాన్ని సాధించాడా? లేక అతని ప్లాన్స్ ని గ్రామస్థులు తెలుసుకున్నారా? అన్నది మిగతా కథ.
తొంగి తొంగి (క్లబ్ మిక్స్) రచన: బాలాజీ, గానం. విజయ్ ప్రకాష్
మనసున వెయ్యి , రచన: బాలాజీ, గానం.విజయ్ ప్రకాష్
సుకుమారుడు , రచన: బాలాజీ, గానం.రాజాహసన్ , రాజేష్, ధనుంజయ్ , మంజు , రమ్య, ప్రదీప్తి
మనసున నువ్వెలే , రచన : రాంభట్ల, గానం.అంజనసౌమ్య
తొంగి తొంగి , రచన: కందికొండ యాదగిరీ , గానం.సుచిత్ర, రాంకీ
నీలాకాశం లో, రచన: శ్రీమణి , గానం.శ్రేయాఘోషల్
ఓ బేబీ నాలోకం , రచన: శ్రీమణి, గానం.అనూప్ రూబెన్స్.