సుగంధ గర్గ్ | |
---|---|
![]() 2012లో సుగంధ గర్గ్ | |
జననం | |
ఇతర పేర్లు | సుగంధ రామ్ |
వృత్తి | నటి, టీవీ హోస్ట్, గాయని, దర్శకురాలు, ఫోటోగ్రాఫర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2000–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | [1] |
సుగంధ గర్గ్ (ఆంగ్లం: Sugandha Garg; జననం 1982 మే 13)[2] ఒక భారతీయ నటి, గాయని. టెలివిజన్ హోస్ట్[3] కూడా అయిన ఆమె వెబ్ సిరీస్ గిల్టీ మైండ్స్‌లో నటించింది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పుట్టిన ఆమె హైదరాబాదులో పెరిగింది. మీనా గర్గ్, శేఖర్ గర్గ్ ఆమె తల్లిదండ్రులు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మైత్రేయి కళాశాలలో సుగంధ గర్గ్ డిగ్రీ చదువుకుంది. పద్దెనిమిదేళ్ల వయసులోనే బీబీసీ చానెల్‌లో ఉద్యోగం వచ్చింది. హోస్ట్‌గా హాథ్ సే హాథ్ మిలా షో ని ఆమె నిర్వహించింది. ఫొటోగ్రఫీలోనూ శిక్షణ పొందింది. జానే తూ యా జానే నా సినిమాతో అరంగేట్రం చేసింది. తర్వాత లెట్స్ డాన్స్, మై నేమ్ ఈజ్ ఖాన్ వంటి సినిమాలూ చేసింది.
తెరే బిన్ లాడెన్ తో మంచి గుర్తింపు రావడంతో అదే సినిమా సీక్వెల్లోనూ అవకాశం వచ్చింది. ది కైట్ – పతంగ్, కాఫీ బ్లూమ్ వంటి చిత్రాలతో ఆమె అంతర్జాతీయ ప్రేక్షకులకూ దగ్గరయింది. సంతోష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన సిలోన్ తమిళ చిత్రంతో దక్షిణాది చిత్రసీమలోనూ మెరిసింది.
2006లో ఆమె టెలివిజన్ నిర్మాత, ఎం టీవీ రియాలిటీ షో హోస్ట్ రఘు రామ్‌ని వివాహం చేసుకున్నది. ఆ తరువాత వారు 2018 జనవరి 30న అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
Year | Film | Role | Notes |
---|---|---|---|
2008 | జానే తూ... యా జానే నా | షాలీన్ | |
2009 | లెట్స్ డాన్స్ | అనౌష్క | |
2009 | ముంబై కాలింగ్ | TV సిరీస్ | |
2010 | మై నేమ్ ఈజ్ ఖాన్ | కోమల్ (రిపోర్టర్) | |
2010 | తేరే బిన్ లాడెన్ | జోయా ఖాన్ | |
2011 | పతంగ్ | ప్రియా | |
2014 | సిలోన్ | రజనీ | ద్విభాషా చిత్రం (ఇంగ్లీష్, తమిళం) |
2015 | కాఫీ బ్లూమ్ | అనికా | |
2016 | తేరే బిన్ లాడెన్ 2 | జోయా ఖాన్ | |
2016 | జుగ్ని | విభావరి |
Year | Series | Role | Language | Platform | Notes |
---|---|---|---|---|---|
2020 | ఆర్య | హేనా | హిందీ | డిస్నీ+ హాట్‌స్టార్ | |
2022 | గిల్టీ మైండ్స్ | వందనా కథపాలియా | హిందీ | అమెజాన్ ప్రైమ్ వీడియో | |
2022 | ఆర్య 2 | హేనా | హిందీ | డిస్నీ+ హాట్‌స్టార్ |
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)