వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సుజిత్ బిజ్జహళ్లి సోమసుందర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బెంగళూరు, కర్ణాటక | 2 డిసెంబరు 1972||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 99) | 1996 అక్టోబరు 17 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1996 అక్టోబరు 21 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1991–2000 | కర్ణాటక | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001–2002 | సౌరాష్ట్ర | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2002–2003 | కేరళ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004–2006 | కర్ణాటక | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2006 మార్చి 6 |
సుజిత్ బిజ్జహళ్లి సోమసుందర్, కర్ణాటకకు చెందిన భారతీయ మాజీ క్రికెటర్. కర్ణాటక తరపున దేశీయ క్రికెట్ తోపాటు, 1996లో భారతదేశం తరపున రెండు అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు ఆడాడు.
సుజిత్ సోమసుందర్ 1972, డిసెంబరు 2న కర్ణాటక రాజధాని బెంగళూరులో జన్మించాడు.
కర్ణాటకతో డొమెస్టిక్ సర్క్యూట్‌లో కొన్ని మ్యాచ్ లలో మంచి ఆటతీరు కారణంగా సోమసుందర్‌కు అవకాశం లభించింది. సోమసుందర్ 1990-91 సీజన్‌లో రంజీ ట్రోఫీలో కర్ణాటక తరపున మొదటిసారిగా ఆడాడు. 1991, ఫిబ్రవరిలో మహారాష్ట్రపై తన మొదటి ఆటను మరొక అరంగేట్ర క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి ఆడాడు. రెండు ఇన్నింగ్స్‌లలో 29, 27 (నాటౌట్) పరుగులు చేశాడు. తరువాతి సీజన్‌లో తమిళనాడుతో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఐదు ఓవర్లలో 3/15తో తీశాడు. కర్ణాటక జట్టులో శాశ్వత స్థానాన్ని పొందేందుకు ఎటువంటి అవకాశాలు రానప్పుడు, సోమసుందర్‌కు మాజీ భారత క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్ మద్దతు ఇచ్చాడు. స్థానిక క్లబ్ అయిన సిటీ క్రికెటర్స్ కోసం ఆడుతున్నప్పుడు మాజీ ఆటగాడితో కలిసి ఆడాడు. కర్ణాటకకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన కార్ల్టన్ సల్దాన్హా రిటైర్మెంట్ కారణంగా సోమసుందర్‌కు మళ్ళీ జట్టులో చోటు లభించింది.[1]
1994-95లో విజృంభించి గోవాపై సెంచరీ సాధించాడు. 1995-96 రంజీ ట్రోఫీ సీజన్‌లో కర్ణాటకకు కీలక సభ్యుడిగా ఉన్నాడు. రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలతో రంజీ ట్రోఫీలో కర్ణాటక విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఫైనల్లో 99, 53 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో 61.76 సగటుతో 803 పరుగులు చేశాడు.[1][2]
దేశీయ టోర్నమెంట్లలో మంచి ఆటతీరు వల్ల సోమసుందర్‌ను టైటాన్ కప్ (దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలను కూడా కలిగి ఉన్న ముక్కోణపు వన్డే ఇంటర్నేషనల్ సిరీస్) కోసం భారత జాతీయ జట్టుకు పిలిపించారు.[3] హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం చేశాడు. డారిల్ కల్లినన్ చేతిలో రనౌట్ కావడానికి ముందు అతను 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు.[4] ఆ తదుపరి వన్డేలో చివరిసారిగా ఆడాడు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తన సొంత మైదానంలో ఆస్ట్రేలియాతో ఆడుతుండగా, సోమసుందర్‌ను పేస్‌మెన్ గ్లెన్ మెక్‌గ్రాత్[5] పరుగుల వద్ద అవుట్ చేశాడు. తరువాత జట్టు నుండి తొలగించబడ్డాడు, మిగిలిన ఆటలకు అతని స్థానంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎంపికయ్యాడు.[6]
జాతీయ సెలెక్టర్లచే తిరస్కరించబడిన సోమసుందర్ మంచి ఫామ్‌లో కొనసాగాడు, 1997-98 సీజన్‌లో 629 పరుగులు చేశాడు. ఆ మరుసటి సంవత్సరం 529 పరుగులు చేయడం ద్వారా కర్ణాటకను మరో రంజీ ట్రోఫీని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. 1998లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన ఫైనల్‌లో సోమసుందర్ 68 పరుగులు చేశాడు. 1990లలో అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, రాహుల్ ద్రవిడ్, వెంకటేష్ ప్రసాద్, డేవిడ్ జాన్సన్, దొడ్డా గణేష్, సునీల్ జోషి వంటి అనేకమంది ఆటగాళ్ళను భారత జట్టుకు అందించిన కర్ణాటక సెటప్‌లో భాగంగా ఉన్నాడు.
2002లో కేరళ తరపున ఆడుతూ, త్రిపురపై తన అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు 222 స్కోర్ చేశాడు. ఆ సీజన్‌లో 1000 పరుగులకు పైగా పరుగులు చేశాడు. ఇది ఆ సంవత్సరంలో బ్యాట్స్‌మెన్ అత్యధిక పరుగులుగా నమోదైంది. తన కెరీర్ చివరి సంవత్సరాల్లో సౌరాష్ట్ర తరపున ఆడాడు, 2007లో రిటైరయ్యాడు.[7] 2006 నవంబరు నుండి 2012 మే వరకు విప్రో టెక్నాలజీస్ కోసం బిహేవియరల్ ఎక్స్‌పర్ట్ & లీడర్‌షిప్ ట్రైనింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. వారి వ్యాపార నాయకులు, నిర్వాహకుల పనితీరును మార్చే బాధ్యతను చేపట్టాడు. 2012 జూన్ నుండి 2014 మార్చి వరకు కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. కోచ్‌గా మొదటి సంవత్సరంలో, బిసిసిఐ నిర్వహించిన విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) & గులాం అహ్మద్ ట్రోఫీ (20 ఓవర్ల ఫార్మాట్) రెండింటిలోనూ రన్నరప్‌గా నిలిచి కేరళ అనూహ్యంగా మంచి ప్రదర్శన చేసింది. యునైటెడ్ స్టేట్స్‌లో గుర్తింపు పొందిన స్పోర్ట్స్ సైకాలజిస్ట్ అయిన డా. ప్యాట్రిక్ కోన్ వద్ద శిక్షణ పొందిన పార్ట్-టైమ్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ కూడా పనిచేశాడు.