పద్మభూషణ్ సుధా రఘునాథన్ | |
---|---|
![]() 2010లో చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ వద్ద సుధా రఘునాధన్ | |
జననం | చెన్నై |
జాతీయత | భారతదేశం |
పౌరసత్వం | భారతీయులు |
విద్య | అర్థశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేట్ |
విద్యాసంస్థ | ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ |
వృత్తి | గాయకురాలు, స్వరకర్త |
జీవిత భాగస్వామి | రఘునాథన్ (1982–ప్రస్తుతం) |
పిల్లలు |
|
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | పద్మశ్రీ, సంగీత కళానిధి, కలామణి, పద్మ విభూషణ్ |
సంగీత ప్రస్థానం | |
సంగీత శైలి | indian classical, carnatic |
సుధా రఘునాథన్ భారతదేశానికి చెందిన కర్ణాటక గాయకురాలు, స్వరకర్త. ఆమెకు కలైమమణి పురస్కారాన్ని 1994 లో తమిళనాడు ప్రభుత్వం, పద్మశ్రీ (2004) [1] , పద్మ భూషణ్ (2015) [1] పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రదానం చేసింది.
సుధా రఘునాథన్ చెన్నైలో జన్మించింది. తరువాత బెంగళూరు, చెన్నైలలో నివసించింది.[2] ఆమె చెన్నైలోని గుడ్ షెపర్డ్ కాన్వెంట్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె ఎతిరాజ్ కాలేజీలో చదువుకుంది. ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందింది.[3]
సుధ రఘునాథన్ తన తల్లి వి. చూడామణీ నుండి కర్ణాటక సంగీతంలో ప్రారంభ శిక్షణ పొందింది. మూడేళ్ల వయస్సు నుంచి ఆమె భజనలు, హిందూ భక్తి పాటలు నేర్చుకోవడం ప్రారంభించింది. బి.వి.లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆమె శిక్షణ కొనసాగింది. 1977 లో కర్ణాటక సంగీతాన్ని డాక్టర్ ఎం.ఎల్. వసంత కుమారి వద్ద అభ్యసించడానికి ఆమె భారత ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ను అందుకుంది. ఆమె వద్ద 13 సంవత్సరాల పాటు విద్యార్థిగా కొనసాగింది.[4] గురుకుల శైలిలో డాక్టర్ ఎం.ఎల్. వసంతకుమారి ఆధ్వర్యంలో శిక్షణ పొందింది. గురువుగారి శైలి, విలక్షణతలను గ్రహించడానికి గణనీయమైన స్థాయిలో వినేది. ఆమె విధుల్లో భాగంగా గురువుగారి కచేరీలలో తంబురా వాయిస్తూ తోడుగా ఉండేది.[2][4][5]
జనవరి 2015 నాటికి, అశోక మిత్రాన్ 2009 లో ప్రచురించిన ఒక నవల ఆధారంగా రాబోయే తమిళ చిత్రం 'తన్నీర్' తో సంగీత దర్శకురాలిగా కోలీవుడ్‌లోకి ప్రవేశించింది.[6]
ఆమె గురువు డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి 1990లో మరణించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం సుధా రఘునాథన్ మద్రాస్ మ్యూజిక్ సీజన్లో ప్రదర్శనలను ఇచ్చింది.[7] ఆమె భారతదేశపు ప్రముఖ కర్ణాటక ప్రదర్శనకారులలో ఒకరిగా పరిగణింపబడింది.[8] 2013 లో ఆమెకు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగిత కలానిధి పురస్కారం ప్రదానం చేసింది.[3] ఆమెకు జనవరి 2015 లో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర గౌరవం అయిన పద్మ భూషణ్ లభించింది.
2 అక్టోబర్, 2016 న, ఐక్యరాజ్యసమితి భారతదేశ కర్ణాటక సంగీత కళాకారుడు భారత్ రత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మిని గౌరవించటానికి స్టాంప్‌ను విడుదల చేసింది. ఈ స్టాంప్‌ను 2 అక్టోబర్ 2016 న ఐక్యరాజ్యసమితిలో ఆమె ప్రదర్శనను గౌరవించటానికి సుధ రఘునాథన్‌కు అందజేశారు.[9]
రఘునాథన్ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చింది. ఇతర కళాకారుల సహకారంతో కూడా ప్రదర్శనలిచ్చింది. ఆమె ఐక్యరాజ్యసమితి,[10] పారిస్‌లోని థెట్రే డి లా విల్లే వద్ద ప్రదర్శనలను ఇచ్చింది. భారతీయ విద్యా భవన్‌కు 50 సంవత్సరాల జ్ఞాపకార్థం న్యూయార్క్ బ్రాడ్‌వేలోని లింకన్ సెంటర్‌లోని ఆలిస్ తుల్లీ హాల్‌లో సుధా ప్రదర్శన ఇచ్చింది. జర్మనీలోని లోరాచ్‌లో 'బర్గోఫ్' అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ నిర్వహించిన స్టిమెన్ వాయిసెస్ ఇంటర్నేషనల్ వోకల్ ఫెస్టివల్ నిర్మించిన గ్లోబల్ వోకల్ మీటింగ్‌లో పాల్గొన్న ఏకైక భారతీయ గాయకురాలు ఆమె.
రఘునాథన్ తమిళ సినిమాలో ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా పనిచేసింది.[11] ఆమె ఇళయరాజా సంగీత సారధ్యంలోని సినిమా "ఇవాన్" లో "ఎన ఎన్న సెతాయ్" పాటకు నేపధ్యగాయకురాలిగా పనిచేసింది.
కర్ణాటక సంగీతకారులను అనుసరించి, సుధా రఘునాథన్ తన విద్యార్థులకు కూడా సంగీత సంప్రదాయాన్ని నేర్పించారు.[12] సుధా 2017 లో విజయదశమి రోజున తన సొంత పాఠశాల "సుధర్నవ అకాడమీ ఫర్ మ్యూజికల్ ఎక్సలెన్స్" ను ప్రారంభించింది. ఈ పాఠశాలలో సుధ రఘునాథన్ తో పాటు ఆమె విద్యార్థులలు కూడా అధ్యాపకులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికలలో ప్రదర్శనలు, వర్క్‌షాపులు నిర్వహించింది.
సుధా రఘునాథన్ వివాహంచేసుకుంది. ఆమెకు కౌశిక్, మాలవికా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆమె స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనేది. 1999 లో సముదాయ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. దానికి ఆమె వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ ట్రస్టీ. పిల్లల ఆరోగ్య సంరక్షణ, గృహాలకు మౌలిక సదుపాయాలు, పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు వంటి విభాగాలలో ఫౌండేషన్ స్వతంత్రంగా సహాయం చేసింది.[2] ఒరిస్సాలో గుజరాత్ భూకంపం, తుఫాను ఉపశమన బాధితుల కోసం ఈ ఫౌండేషన్ నిధులు సేకరించింది.[13]
ఇయర్ | సాంగ్ | ఆల్బమ్ | సంగీతం | కో-సింగర్స్ |
---|---|---|---|---|
2012 | కొనియాడ తారమే [14] | త్రహిమామ్ 2 | ప్రణం కమలకర్ | రూప రేవతి |
సన్నుతింథుమో ప్రభు [14] | త్రహిమామ్ 2 | ప్రణం కమలకర్ |
<ref>
ట్యాగు; వెబ్ మూలము
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు