సుధారాణి | |
---|---|
జననం | జయశ్రీ 1973 ఆగస్టు 14 బెంగళూరు, భారతదేశం |
వృత్తి | నటి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ |
క్రియాశీల సంవత్సరాలు | 1978 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సంజయ్
(m. 1996; div. 1998)గోవర్ధన్ (m. 2000) |
పిల్లలు | నిధి(b.2001) |
సుధారాణి (జననం 1973 ఆగస్టు 14) అసలు పేరు జయశ్రీ. భారతీయ నటి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, మాజీ మోడల్. ఆమె ప్రధానంగా కన్నడ చిత్రాలలో నటించింది. అలాగే ఆమె తెలుగు, తుళు, మలయాళ చిత్రాలలో కూడా నటించింది. ఆమె కూచిపూడి, భరత నాట్యం నర్తకి.
2015లో వచ్చిన సచిన్ (టేండుల్కర్ కాదు), జెస్సీ (2019), కురుక్షేత్రం 2018 చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
మూడు సంవత్సరాల వయస్సులో ఆమె ఒక బిస్కెట్ బ్రాండ్ కోసం చైల్డ్ మోడల్‌గా ఎంపికైంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆమె కిలాడి కిట్టు (1978), కుళ్ల కుల్లి (1980), అనుపమ (1981) భాగ్యవంత, రంగనాయకి (1981) చిత్రాల్లో నటించింది. ఆమె 13 సంవత్సరాల వయస్సులో ఆనంద్ (1986)తో ప్రధాన నటిగా రంగప్రవేశం చేసింది. 1980ల చివరలో, 1990లలో ఆమె రణరంగ (1988), కృష్ణ నీ కునిదగ (1989), పంచమ వేద (1989), మైసూరు మల్లిగే (1992), మన్నిన దోని (1992), మనే దేవ్రు (1992), మనే దేవ్రు ( 1993), అనురాగ సంగమ (1995) స్వాతి, మిడిద శ్రుతి, ఆరగిణి, శ్రీగంధ, కుంకుమ భాగ్య, కావ్య, సప్తపది, ముంజనేయ మంజు, మనమెచ్చిద హుడుగి, స్పర్శ (2000) వంటి ఎన్నో చిత్రాలలో నటించింది.
ఆమె తన నటనకు గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు రెండుసార్లు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది.
సుధారాణి 1996లో అమెరికాలో స్థిరపడిన అనస్థీషియా నిపుణుడు డాక్టర్. సంజయ్‌ను వివాహం చేసుకుంది. అయితే వారు 1998లో విడిపోయారు. తర్వాత, ఆమె 2000లో గోవర్ధన్‌ను వివాహం చేసుకుంది.[1] వారికి 2001లో కుమార్తె నిధి జన్మించింది.[2]
Year | Film | Actress |
1999 | ప్రేమోత్సవ | రోజా |
2002 | సింహాద్రి సింహా | మీనా |
2004 | మౌర్య | రోజా |
2004 | మోనాలిసా | సదా |
2012 | ప్రసాద్ | మాధురీ భట్టాచార్య |
2014 | మాణిక్య | రమ్య కృష్ణ |
2022 | K.G.F: చాప్టర్ 2 | రవీనా టాండన్ |
Year | Film | Award | Category | Result |
---|---|---|---|---|
1991 | పంచమ వేద | కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు | ఉత్తమ నటి | విజేత |
1992 | మైసూర్ మల్లిగే | విజేత | ||
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి | విజేత | ||
2000 | స్పర్శ | విజేత | ||
2015 | వాస్తు ప్రకార | ఉత్తమ సహాయ నటి | విజేత |