సుప్రియ సులే | |||
పదవీ కాలం 2014 – ప్రస్తుతం | |||
ముందు | శరద్ పవార్ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 31 మే 2009 | |||
అధ్యక్షుడు | ప్రతిభా పాటిల్ ప్రణబ్ ముఖర్జీ రామ్‌నాథ్ కోవింద్ | ||
ముందు | శరద్ పవార్ | ||
నియోజకవర్గం | బారామతి | ||
పదవీ కాలం 18 సెప్టెంబర్ 2006 – 31 మే 2009 | |||
అధ్యక్షుడు | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ | ||
నియోజకవర్గం | మహారాష్ట్ర | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] పూణే, మహారాష్ట్ర, భారతదేశం | 1969 జూన్ 30||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | శరద్ పవార్ (తండ్రి) ప్రతిభ పవార్ (తల్లి) | ||
జీవిత భాగస్వామి | సదానంద్ సులే | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | జై హింద్ కాలేజీ, ముంబై |
సుప్రియా సూలే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం బారామతి లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుంది.
సుప్రియ సూలె 1969 జూన్ 30నమహారాష్ట్ర రాష్ట్రం, పూణే లో శరద్ పవార్, ప్రతిభ దంపతులకు జన్మించింది. ఆమె ముంబైలోని జై హింద్ కాలేజీ నుండి మైక్రోబయాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. సుప్రియా సూలేకు 1991 మార్చి 4న సదానంద్ బాలచంద్రతో వివాహం జరిగింది వారికీ ఒక కుమారుడు విజయ్, కుమార్తె రేవతి ఉన్నారు.[2]
సుప్రియా సూలే తన తండ్రి శరద్ పవార్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చి 2006లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుండి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె తరువాత ఎన్సీపీ నుండి పోటీ చేసి వరుసగా 2014[3], 2019లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచింది.[4]