సుమిత్ర | |
---|---|
జననం | త్రిస్సూర్, కేరళ, భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1972–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | [1] |
పిల్లలు | ఉమాశంకరి నక్షత్ర[2][3] |
సుమిత్ర భారతీయ సినిమా నటి. ఆమె దక్షిణ భారతదేశంనకు చెందిన తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషా చిత్రాలలో నటించింది. ఆమె 1974, 1985ల మధ్య ప్రధాన కథానాయికగా చేసింది. ఆ తరువాత, ఆమె 1990ల నుండి తల్లి పాత్రలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కేరళలోని త్రిసూర్‌లో రాఘవన్ నాయర్, జానకి దంపతులకు ఆమె జన్మించింది.[4] ఆమెకు ముగ్గురు సోదరులు ఉన్నారు, ఆమె తండ్రి ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలో పనిచేసాడు. ఆమె పాఠశాలలో చదువుతున్నప్పుడు, నటి కె.ఆర్.విజయకు మార్గదర్శిగా ఉన్న మురుగప్పన్ మాస్టర్ వద్ద ఆమె నృత్యం నేర్చుకుంది. సుమిత్ర మంచి క్లాసికల్ డ్యాన్సర్.
19 ఏళ్ల వయసులో సుమిత్ర మలయాళ చిత్రం నృతశాల (1972)లో చిన్న పాత్రతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె టాలెంట్‌ని గుర్తించిన దర్శకుడు ఎ.బి.రాజ్, తన నిర్మలయం చిత్రంలో కథానాయికగా ఆమెను తెరంగేట్రం చేయించాడు. తమిళంలో, అవలుమ్ పెన్ తానే (1974) ఆమె మొదటి చిత్రం. కాగా, కన్నడలో ఆమె మొదటి చిత్రం ముగియద కథే (1975), ఇందులోని ఎవర్‌గ్రీన్ పాట కంగాలు వందనే హెలిడేకు ప్రసిద్ధి చెందింది.
ఆమె కన్నడలో విష్ణువర్ధన్, రాజేష్; తమిళంలో శివాజీ గణేశన్, జైశంకర్, శివకుమార్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అనేక మంది ప్రముఖ హీరోలతో నటించింది. రజనీకాంత్, కమల్ హాసన్ లతో హీరోయిన్‌గా నటించిన ఆమె ఆ తర్వాత వారికి తల్లిగా కూడా నటించింది.
ఆమె తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషలలో 200 పైగా చిత్రాలలో నటించింది. ప్రస్తుతం, ఆమె సహాయ పాత్రలు పోషిస్తోంది.
ఆమెకు ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు డి.రాజేంద్రబాబును 1980లో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉమాశంకరి, నక్షత్ర. ఉమాశంకరి కన్నడ చిత్రం ఉప్పి దాదా ఎం.బి.బి.ఎస్ (2006) చిత్రంతో లీడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే, ఆమె ఉదయ టీవీలో ప్రసారమయ్యే చిక్కమ్మలో కూడా నటించింది. ఇక, నక్షత్ర తమిళ చిత్రం దూతో కథానాయికగా తెరంగేట్రం చేసింది.