సురిలీ గౌతమ్ | |
---|---|
![]() | |
జననం | లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ఏప్రిల్ 3, 1990
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
భార్య / భర్త |
జస్రాజ్ సింగ్ భట్టి (m. 2013) |
బంధువులు | యామీ గౌతమ్ (అక్క)[2] జస్పాల్ భట్టి (మామ) |
తండ్రి | ముఖేష్ గౌతమ్ |
సురిలీ గౌతమ్ భట్టి (జననం 1990 ఏప్రిల్ 3) ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి. ఆమె దర్శకుడు ముఖేష్ గౌతమ్ కుమార్తె, నటి యామీ గౌతమ్ చెల్లెలు.[3] ఆమె 2008లో మీట్ మిలా డి రబ్బా చిత్రంతో టెలివిజన్లోకి అడుగుపెట్టింది.[4] ఆ తరువాత, ఆమె పంజాబీ చిత్రం పవర్ కట్ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[5]
ఆమె సవితా భట్టి, దివంగత భారతీయ హాస్యనటుడు, వ్యంగ్య రచయిత జస్పాల్ భట్టి కుమారుడు జస్రాజ్ సింగ్ భట్టిని నవంబరు 2013లో చండీగఢ్‌లో వివాహం చేసుకుంది.[1] ఆమె వైపిఎస్ మొహాలి నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఎస్డి కళాశాల చండీగఢ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె ముంబైలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మీడియా నుండి మీడియా అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ కూడా చేసింది.