సురేందర్ రెడ్డి | |
---|---|
జననం | పత్తి సురేందర్ రెడ్డి 1975 డిసెంబరు 7 |
ఇతర పేర్లు |
|
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 2005– ఇప్పటి వరకు |
జీవిత భాగస్వామి | దీపా రెడ్డి[1] |
సురేందర్ రెడ్డి ఒక తెలుగు సినిమా దర్శకుడు. అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.
వీరిది కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, మాచినపల్లి అనే గ్రామం. నాన్న (వీరారెడ్డి) ఇతడి చిన్నతనంలో ఊరికి సర్పంచ్గా వుండేవాడు. వీరిది సంపన్న కుటుంబం. ఆరుగురు సంతానం. ఇతడు నాలుగో వాడు. ఇతడికి ఒక అక్క, ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు చెల్లెళ్ళు. తండ్రి రాజకీయంగా బాగా పలుకుబడి ఉంది. పదో తరగతి వరకూ ఇతడి చదువు సరస్వతీ గురుకుల విద్యాలయంలో సజావుగానే సాగింది. ఇంటర్మీడియట్ నుంచీ చదువు సరిగా సాగలేదు. ఎందుకో చదువుమీద ఆసక్తి పోయింది. డిగ్రీకి మధ్యలోనే గుడ్ బై చెప్పేసి హైదరాబాదు వచ్చేశాడు.[2]
ఇతడికి ప్రత్యేకంగా నాటకాలు, సాహిత్యం, సినిమాలు అనేవాటిమీద ప్రత్యేకమైన ఆసక్తి పెద్దగా ఏమీ లేదు, కానీ మణిరత్నం ఘర్షణ, వర్మ శివ ఇతడి మీద చాలా ప్రభావం చూపించాయి. సినిమా విజయంలో దర్శకుడికి గల పాత్రనీ, దర్శకుడు తలచుకుంటే సృష్టించగల అద్భుతాలకీ అవి నిదర్శనాలని, అవి చూసినప్పుడే సినిమాల్లోకి వెళ్ళి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని అనుకునేవాడు.
హైదరాబాదు చేరుకున్నాక గానీ సినిమాల్లో అవకాశం అనేది అంత సులువుకాదని తేలీలేదు. హైదరాబాదు రావడానికి ఇంట్లో వాళ్ళేమీ ఎదురు చెప్పలేదు, కానీ అన్నీ ఉన్న కుటుంబం కదా ఎందుకునువ్విలా వెళ్ళడం అనే ఫీలింగ్ వుండేదేమోకానీ,అతని తల్లిదండ్రులు ఇతడితో ఎప్పుడూ అనలేదు. ఇతడిని డిస్కరేజ్ చెయ్యలేదు. హైదరాబాదులో ఇతని బావ ఒక అపార్ట్‌మెంట్ లో ఉండేవాడు. చేతిలో డబ్బులుంటే అద్దె కట్టే వాడు లేకుంటే లేదు.తనంటూ నిరూపించుకోవాలనీ, సొంతంగా కాళ్ళమీద నిలబడాలని వచ్చాడు, కాబట్టి ఇంట్లోంచి డబ్బులు అడిగి తెప్పించుకోవడం నామోషీగా వుండేది. ఫ్రెండ్స్ సహకారంతోనే వాళ్ళనడగడానికి కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు చేతిలో డబ్బులు సరిపోక సరిగా భోజనం చెయ్యని రోజులుకూడా ఉన్నాయి. అందరూ అన్నీ ఉన్నవాడివి, ఎందుకిలా ఇబ్బందులు పడడం అనేవాళ్ళు. కానీ ఇతడిలో పట్టుదల అన్నింటినీ భరించేలా చేసింది. అప్పట్లోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచీ హైదరాబాదుకి వచ్చింది. ఇప్పుడున్నంత సౌకర్యవంతమైన వాతావరణం అప్పట్లో లేదు. ఎవ్వరూ దగ్గరికే రానిచ్చేవారు కాదు.
సంవత్సరం | చలన చిత్రం | తారాగణం | సంగీత దర్శకుడు |
---|---|---|---|
2005 | అతనొక్కడే | కళ్యాణ్ రామ్ , సింధు తులాని | మణిశర్మ |
2006 | అశోక్ | జూనియర్ ఎన్. టి. ఆర్ , సమీరారెడ్డి | మణిశర్మ |
2007 | అతిథి | మహేశ్ బాబు , అమృతా రావు | మణిశర్మ |
2009 | కిక్ | రవితేజ , ఇలియానా | తమన్ |
2011 | ఊసరవెల్లి | జూనియర్ ఎన్. టి. ఆర్, తమన్నా | దేవి శ్రీ ప్రసాద్ |
2014 | రేసుగుర్రం | అల్లు అర్జున్ , శ్రుతి హాసన్ | తమన్ |
2015 | కిక్ 2 | రవితేజ , రకుల్ ప్రీత్ సింగ్[3] | తమన్ |
2016 | ధృవ | రాం చరణ్ తేజ, రకుల్ ప్రీత్ సింగ్ | హిప్ హొప్ తమిళా |
2018 | సైరా నర్సింహరెడ్డి[4] | చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయన తార | ఎం. ఎం. కీరవాణి |
2023 | ఏజెంట్ | అక్కినేని అఖిల్, మమ్ముట్టి, సాక్షి వైద్యా | హిప్ హాప్ తమిళా |