సురేశ్ వెనపల్లి |
---|
|
జననం | 1966 వంగూరు |
---|
నివాసం | భారత దేశము |
---|
పౌరసత్వం | భారతీయుడు |
---|
రంగములు | బీజగణితం |
---|
వృత్తిసంస్థలు | హైదరాబాద్ విశ్వవిద్యాలయం |
---|
చదువుకున్న సంస్థలు | టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, హైదరాబాదు విశ్వవిద్యాలయం |
---|
ముఖ్యమైన పురస్కారాలు | శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, 2009 |
---|
సురేశ్ వెనపల్లి భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన బీజగణితంలో పరిశోధనలు చేశారు. ఆయన ఎమొరీ విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని వంగూరు గ్రామంలో జన్మించారు. వంగూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు 9 వతరగతి వరకు చదువుకున్నారు. ఆయన హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ పూర్తి చేసారు. తదుపరి టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో 1989 లో చేరారు. ఆయన అచట రామన్ పరిమళ అధ్వర్యంలో పి.హె.డిని 1994 లో పూర్తిచేశారు. ఆయన ఆ తర్వాత హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు.
- శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని గణిత శాస్త్రం విభాగంలో 2009 లో అందుకున్నారు.[1]
- 2010 లో హైదరాబాదు (తెలంగాణ రాష్ట్రం) లో జరిగిన "ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేధమెటిక్స్"లో వక్తగా ఆహ్వానింపబడ్డారు.[2]
- ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్కా ఫెలోషిప్
- ఆంధ్ర ప్రదేశ్ శాస్త్రవేత్త అవార్డు, 2008
- బి.ఎం.బిర్లా సైన్స్ ప్రైస్,2004
- INSA మెడల్ ఆఫ్ యంగ్ సైంటిస్ట్స్, 1997 [3]
- Zero-cycles on quadric fibrations: finiteness theorems and the cycle map, R Parimala & V Suresh, Invent. Math. 122 (1995), 83–117
- Isotropy of quadratic forms over function fields in one variable over p-adic fields, R Parimala & V Suresh, Publ. de I.H.E.S. 88 (1998) 129–150
- Bounding the symbol length in the Galois cohomology of function field of p-adic curves, to appear in Comm. Math. Helv
- The u-invariant of the function fields on p-adic curves, R Parimala & V Suresh to appear in Annals of Mathematics[4]