సురేష్ పూజారి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 జూన్ 2024 | |||
ముందు | అల్కా మొహంతి | ||
---|---|---|---|
నియోజకవర్గం | బ్రజరాజ్‌నగర్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 23 మే 2019 – 4 జూన్ 2024 | |||
ముందు | ప్రభాస్ కుమార్ సింగ్ | ||
తరువాత | ప్రదీప్ పురోహిత్ | ||
నియోజకవర్గం | బర్గఢ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సంబల్‌పూర్, ఒడిశా, భారతదేశం | 1960 జూలై 29||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | భీంసేన్ పూజారి, ఖిరోద్రి తనయ పూజారీ | ||
జీవిత భాగస్వామి | పద్మిని నాయక్ (m. 07 ఫిబ్రవరి 1987) | ||
సంతానం | 2 | ||
నివాసం | జ్యోత్స్నా భవన్, సఖిపారా, బ్రూక్స్ హిల్, సంబల్‌పూర్ జిల్లా, ఒడిషా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
సురేష్ పూజారి (జననం 29 జూలై 1960) భారతదేశంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బర్గఢ్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా 17వ లోక్‌సభకు, 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బ్రజరాజ్‌నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
సురేష్ పూజారి 29 జూలై 1960న ఒడిషా రాష్ట్రం, సంబల్‌పూర్ జిల్లా, సంబల్‌పూర్ లో భీంసేన్ పూజారి, ఖిరోద్రి తనయ దంపతులకు జన్మించాడు. ఆయన సంబల్‌పూర్ యూనివర్సిటీ పరిధిలోని గంగాధర్ మెహెర్ కళాశాలలో ఎంఎస్సీ (భౌతికశాస్త్రం) , డిప్లొమా ఇన్ లేబర్ లా అండ్ పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ పూర్తి చేసి, లజపత్ రాయ్ లా కాలేజీ నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.
సురేష్ పూజారి 1980 ప్రారంభంలో విద్యార్థి ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 1980 నుండి 1981 వరకు గంగాధర్ మెహర్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా పని చేసి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన 1985, 1995లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సంబల్‌పూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాయడు. సురేష్ పూజారి 1992లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో సంబల్‌పూర్ మునిసిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసి 1992 నుండి 1995 సంబల్‌పూర్ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా, 2002 నుండి 2006 రాష్ట్ర ప్రణాళిక బోర్డు సభ్యుడిగా పని చేశాడు.
సురేష్ పూజారి ఆ తరువాత పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి బ్రజ్‌రాజ్‌నగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా 2000, 2004, 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2006 నుండి 2009 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు. సురేష్ పూజారి ఆ తరువాత పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ఆ తరువాత బిజెపి జాతీయ కార్యదర్శిగా పని చేసి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బర్గఢ్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా 17వ లోక్‌సభకు ఎన్నికై[1] 09 అక్టోబర్ 2019 నుండి పార్లమెంట్‌లో సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యుడిగా, 13 సెప్టెంబర్ 2019 నుండి పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
సురేష్ పూజారి 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బ్రజరాజ్‌నగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అల్కా మొహంతిపై 26789 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన జూన్ 12న మోహన్ చరణ్ మాఝీ మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3][4][5]