ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions) సినీ నిర్మాణ సంస్థ. దీనిని చిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తన పెద్ద కుమారుడు సురేష్ పేరు మీద స్థాపించారు. చిత్ర నిర్మాణం ఎక్కువగా హైదరాబాదు లోని రామానాయుడు స్టుడియోస్ లో జరుగుతాయి. వీరు మొదటి సినిమా అనురాగంను 1963లో నిర్మించారు. వీరి మొదటి సూపర్ హిట్ చిత్రం ఎన్.టి.ఆర్. నటించిన రాముడు భీముడు. ఈ సంస్థ ద్వారా 48 సంవత్సరాల కాలంలో, 131 సినిమాలు, 9 భాషలలో విడుదలయ్యాయి.[1] ఇదొక ప్రపంచ రికార్డు. విజయా పిక్చర్స్ సంస్థతో కలిపి విజయ సురేష్ కంబైన్స్ ద్వారా నిర్మించిన 10 చిత్రాలలో మొదటిది పాపకోసం (1968).
వీరి సంస్థ తెలుగు, హిందీ, తమిళం మూడు భాషలలో నిర్మించిన మెగా హిట్ చిత్రం ప్రేమనగర్ (1971). వీరి శ్రీకృష్ణ తులాభారం (1966) పౌరాణిక చిత్రాలలో తలమానికం పేరుపొందితే, అహనా పెళ్ళంట (1987) ఇప్పటినీ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది.
సురేష్ ప్రొడక్షన్స్ ప్రతి సంవత్సరం సుమారు 5 నుండి 6 చిత్రాలు నిర్మిస్తున్నా, వాటిలో 90 శాతం చిత్రాలు విజయవంతమై సినీ జగత్తులో చిరస్థాయిగా నిల్చుంటాయి.
robo weds robini
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)