సులక్షణ | |
---|---|
జననం | శ్రీదేవి 1964 సెప్టెంబరు 8 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1980-1994 2001-ప్రస్తుతం |
సులక్షణ 1980వ దశకపు తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు సినిమా నటి. రెండున్నరేళ్ల ప్రాయంలోనే బేబీ డాలీ పేరుతో బాల్యనటిగా సులక్షణ సినీరంగంలో ప్రవేశించింది. కథానాయికగా తొలిచిత్రం తెలుగు సినిమా పదహారేళ్ల వయసు. ఈమె తల్లి కళ్యాణి కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది. నృత్య తారగా ‘అమాయకుడు’ చిత్రంలో ‘పట్నంలో శాలిబండ’ పాటలో నటించి ఆ తర్వాత పరిశ్రమనుంచి విరమించింది[1]
సులక్షణ దక్షిణభారత భాషలన్నింటిలో కలిపి దాదాపు 350 సినిమాలలో నటించింది.[2] 1992 వరకు సినీరంగంలో సులక్షణ, ప్రముఖ సంగీతదర్శకుడు ఎం.ఎస్.విశ్వనాధన్ కుమారుడు గోపీకృష్ణను ప్రేమించి పెళ్లాడినది. అయితే పెళ్ళి తర్వాత సినిమాలలో నటించాలని సులక్షణ కోరుకోవడముతో వీరిద్దరూ విడిపోయారు.[3] ప్రస్తుతం ఈమె తమిళ టీవీ ధారావాహిక మలర్‌గళ్‌లో నటిస్తుంది[4].
పన్నెండేళ్ళ వ్యవధి తర్వాత తిరిగి సినీరంగంలో సహానా అనే ధారావాహిక ద్వారా అడుగుపెట్టింది.