సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ | |||
దారుస్సలాం మజ్లిస్ పార్టీ కార్యాలయం
| |||
తరువాత | అసదుద్దీన్ ఒవైసీ (కుమారుడు) | ||
---|---|---|---|
నియోజకవర్గం | హైదరాబాదు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 14 ఫిబ్రవరి, 1931 హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ | ||
మరణం | 29.9.2008 | ||
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | ||
సంతానం | 3 కుమారులు , 1 కుమార్తె. | ||
మతం | ఇస్లాం | ||
వెబ్‌సైటు | లేదు | ||
October 17, 2006నాటికి | మూలం | http://www.etemaaddaily.com/ |
సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ (ఫిబ్రవరి 14, 1931 - సెప్టెంబరు 29, 2008) హైదరాబాదు నగరానికి చెందిన రాజకీయవేత్త. మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు.
1960 లో మల్లేపల్లి కార్పొరేటర్ గా ఎన్నికయ్యాడు. 1962, 67, 78, 83 లలో శాసన సభ్యునిగా, 1984 నుంచి 2004 వరకు 6 సార్లు వరుసగా హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడైన అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికైనంత వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. హైదరాబాద్ నగర మేయర్లుగా ఇద్దరు హిందువులను దళితులను మజ్లిస్ పార్టీ తరపున గెలిపించాడు. ఈయన కుమారులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ఎంపీ, శాసన సభ్యులులుగా పనిచేస్తున్నారు[1][1]. అక్బరుద్దీన్ ఒవైసీ ఆయన రెండవ కుమారుడు. అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఆంధ్రప్రదేశ్లో చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు[2]. సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ యొక్క తండ్రి కూడా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కు అధ్యక్షునిగా పనిచేశాడు.
1976 లో ఆయన తండ్రి మరణానంతరం మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ యొక్క అధ్యక్ష బాధ్యతలను సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ స్వీకరించాడు.
సలాహుద్దీన్ ఒవైసీ "సాలార్-ఎ-మిల్లత్" (సమూహ నాయకుడు - ముస్లిం సమూహ నాయకుడు) గా కూడా అందరికీ పరిచయం. ప్రజలే ఇతడిని "సాలార్ ఎ మిల్లత్" గా, గౌరవంగా పిలిచేవారు. ఆయన తన ఉపన్యాసాలలో ఈ విధంగా చెప్పేవాడు. "భారతదేశం ముస్లింలను వారి అదృష్టానికి వదిలి వేసింది. అందువలన ముస్లిములు ప్రభుత్వం యొక్క సహాయానికి ఎదురు చూడకుండా వారి కాళ్లపై వారు నిలబడాలి". ఒవైసీ ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన రాజకీయ వేత్త. ఆయన ఖ్యాతి రాష్ట్ర సరిహద్దుల వరకు పాకింది. ముస్లిం ప్రజలు ఆయన వెనుకే ఉన్నారని, ముస్లిం ఓటు బ్యాంకుకు ఆయన ప్రధానమైన వాడని అందరూ విశ్వసించేవారు. ఆయన హైదరాబాద్లో ముస్లిం నాయకులలో ప్రసిద్ధమైనవాడు.
సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ అతి పిన్న వయసులోనే ఆయన తండ్రి చెరసాల పాలయ్య సమయంలో రాజకీయ జీవితం ప్రారంభించాడు.
ముసిం ల ఆర్థిక, విద్యాభివృద్ధికి ఒవైసీ మైనారిటీ ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కాలేజీ, ఫార్మసీ కళాశాల, డిగ్రీ కళాశాల, కాలేజ్ ఫర్ హాస్పటల్ మేనేజ్ మెంట్, ఎం.బి.ఎ, ఎం.సి.ఎ., నర్సింగ్, కోపరేటివ్ బ్యాంకు, ఐ.టి.ఐ, రెండు ఆసుపత్రులను స్థాపించాడు. ఉర్దూ పత్రిక ఏతెమాద్ (నమ్మకం / భరోసా) ను ప్రారంభించాడు.