సూర్యకాంతం | |
---|---|
దర్శకత్వం | ప్రణీత్ బ్రహ్మాండపల్లి |
నిర్మాత | సందీప్ ఎర్రంరెడ్డి సృజన్ ఎరబోలు |
తారాగణం | నీహారిక కొణిదెల రాహుల్ విజయ్ పెర్లెన్ భేసానియా శివాజీ రాజా సుహాసిని |
ఛాయాగ్రహణం | హరి జాస్తి |
కూర్పు | రవితేజ గిరిజల |
సంగీతం | మార్క్ కె రాబిన్ |
నిర్మాణ సంస్థ | నిర్వాణ సినిమాస్[2] |
విడుదల తేదీ | 29 మార్చి 2019[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సూర్యకాంతం 2019, మార్చి 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. నిర్వాణ సినిమాస్ పతాకంపై సందీప్ ఎర్రంరెడ్డి, సృజన్ ఎరబోలు నిర్మాణ సారథ్యంలో[3] ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పెర్లీన్ భేసానియా, శివాజీ రాజా, సుహాసిని తదితరులు నటించగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు.[4]
సూర్యకాంతం (నిహారిక) పేరుకు తగ్గట్టే ఎవరికీ అర్ధం కాని ఓ వింత పాత్ర. తనకు నచ్చింది మాత్రమే చేస్తుంది. ఎవ్వరి కోసం తను మారదు. ఎవరూ తనకోసం మారాలని అనుకోదు. తనకు తానే ముద్దు.. తన తరువాతే ఎవరైనా. ఇలాంటి ఇంట్రస్ట్రింగ్ క్యారెక్టర్‌ని తొలిచూపులోనే చూసి ప్రేమిస్తాడు అమాయకపు అభి (రాహుల్ విజయ్). లవ్, కమిట్మెంట్, ఎమోషన్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండే సూర్యకాంతం.. అభి ప్రేమను వద్దంటూనే అట్రాక్ట్ అవుతుంది. అదే సందర్భంలో అభి లవ్ ప్రపోజ్‌కి ఎలా స్పందించాలా తెలియని కన్ఫ్యూజన్‌లో ఎవరికీ చెప్పకుండా దూరంగా వెళిపోతుంది. దీంతో అభి చిన్ననాటి స్నేహితురాలు పూజతో (పెర్లిన్ భెసానియా)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. వీరి కథ పెళ్లితో సుఖాంతం అవుతుందనుకుంటున్న సందర్భంలో సూర్యకాంతం కథలోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
Untitled | |
---|---|
ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు.
ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "ఇంతేనా ఇంతేనా" | సిద్ శ్రీరామ్, శక్తిశ్రీ గోపాలన్ | |
2. | "బిస్కట్" | మౌనిక రెడ్డి | |
3. | "పో పోవే" | కార్తీక్ | |
4. | "బ్రేకింగ్ మై హార్ట్" | సునీత సారధి | |
5. | "నేనేనా నేనేనా" | సిద్ శ్రీరామ్, శక్తిశ్రీ గోపాలన్ | |
6. | "ఫ్రైడే నైట్ బేబి" | రోల్ రైడా (రాప్స్), అనురాగ్ కులకర్ణి, హారిక నారాయణ్ |
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 2.5/5 రేటింగ్ ఇచ్చింది. "సూర్యకాంతం పాత్ర ఆడపిల్లల బాధల నుండి రిఫ్రెష్ చేసేలా ఉంది" అని రాసింది.[5] "సినిమా ఇతివృత్తం కొత్తగా లేదు, చిత్రం పూర్తయ్యేసరికి మరొక వెబ్ సిరీస్ ని వెండితెరపై చూసినట్టు అనిపిస్తుంది" అని ది హిందూ పత్రికలో రాశారు.[6] న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది.[7] "బలహీనమైన కథ, ఎక్కువ నిడివి ఉన్న సన్నివేశాలు ఈ చిత్రానికి మైనస్ పాయింట్స్ గా ఉన్నప్నటికి ఒక్కసారి చూడదగ్గ మంచి చిత్రమిది" అని ది హన్స్ ఇండియా పత్రిక రాసింది.[1]