వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | పూనమ్ యాదవ్ |
జట్టు సమాచారం | |
చరిత్ర | |
IZODC విజయాలు | 7 |
IZ3D విజయాలు | 3 |
IZT20 విజయాలు | 1 |
IZOD విజయాలు | 0 |
సెంట్రల్ జోన్ మహిళల క్రికెట్ జట్టు (సెంట్రల్ జోన్, ఇండియా) భారత దేశ కేంద్ర మండలానికి ప్రాతినిధ్యం వహించే మహిళల క్రికెట్ జట్టు. ఇది మహిళల సీనియర్ అంతర మండల ఒక రోజు పోటీ (ఇంటర్ జోనల్ వన్డే) లు), అంతర మండల (ఇంటర్ జోనల్) T20 లలో ఆడుతుంది. ఇది సెంట్రల్ ఇండియాకు చెందిన, ఆరు మహిళా క్రికెట్జ జట్ల క్రీడాకారుణుల మిశ్రమ జట్టు. అవి - ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రైల్వేస్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ జట్లు. ఈ మిశ్రమ జట్టు రాణి ఝాన్సీ ట్రోఫీలో ఆడటానికి 1974-75లో ఏర్పడింది, 2002-03 వరకు ఆడారు. ఆ తర్వాత వారు 2006–07, 2013–14 మధ్య జరిగిన అంతర మండల ఒక రోజు (ఇంటర్ జోన్ మహిళల వన్డే) పోటీలో 8 మ్యాచ్ లకు 7 సార్లు గెలిచారు. 2014–15, 2017–18 మధ్య జరిగిన అంతర మండల మూడు రోజుల పోటీ (ఇంటర్ జోన్ మహిళల త్రీ డే కాంపిటీషన్) లో 4 మ్యాచ్ లలో 3 గెలిచారు. 2022–23లో అంతర మండల T20 ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకున్నారు.[1][2]
సెంట్రల్ జోన్ మహిళా జట్టు మొదటిసారిగా రాణి ఝాన్సీ ట్రోఫీ కొరకు 1974–75 సీజన్ లిస్ట్ A పోటీలో ఆడింది. 2002-03 సీజన్ తర్వాత రద్దు అయ్యే వరకు వారు టోర్నమెంట్‌లో ఆడుతూ ఉన్నారు. అయితే ట్రోఫీకి సంబంధించిన పూర్తి ఫలితాలు నమోదు కాలేదు.[3]
2007లో, ఈ జట్టు ఒక రోజు పోటీలో ఆడటం ప్రారంభించింది, వారు 2006-07 సీజన్ నుండి 2013-14 సీజన్ తర్వాత ముగిసే వరకు ఆడారు. 8 సీజన్లలో 7 సార్లు టైటిల్‌ను గెలుచుకుని, ఈ జట్టు పోటీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. 2011–12లో మాత్రమే వారు రన్నర్-అప్‌గా నిలిచారు. అప్పుడు ఉత్తర మండలం జట్టు మ్యాచ్ గెలుచుకుంది.[3][4][5][6][7][8][9][10][11]
2014–15 సీజన్‌లో, మహిళల జోనల్ జట్లు అంతర మండల రెండు రోజుల పోటీలో పాల్గొనడం ప్రారంభించాయి. మొదటి సీజన్‌లో, సెంట్రల్ జోన్ నాలుగు మ్యాచ్‌లలో 3 మ్యాచ్ లు డ్రా అవగా మొదటి ఇన్నింగ్స్‌లో గెలిచి టోర్నమెంట్‌కు కూడా విజేత అయింది.[12] తరువాతి, 2015-16 సీజన్లో టోర్నమెంట్ మూడు రోజుల పోటీలుగా మారింది, ఈ సెంట్రల్ జోన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో గెలిచి, రెండు మ్యాచ్ లు డ్రా అయి మళ్లీ విజేతగా నిలిచింది.[13] ఈ జట్టు 2016–17లో మొదటి ఇన్నింగ్స్‌లో రెండు విజయాలు, రెండు డ్రా లతో గెలిచారు.[14] అయితే 2017–18లో, సెంట్రల్ జోన్ ఒక విజయం, రెండు ఓటములతో నాల్గవ స్థానంలోకి నిలిచింది.[15]
2022–23లో, మహిళల సీనియర్ అంతర మండల క్రికెట్ T20 రూపంలో తిరిగి ఆడటం మొదలు పెట్టారు.[2] ఈ సెంట్రల్ జోన్ జట్టు అన్ని పోటీలలోను అజేయంగా నిలిచి టైటిల్‌ను గెలుచుకుంది.[2] 2023 ఫిబ్రవరిలో, 2022–23 మహిళల సీనియర్ ఇంటర్ జోనల్ వన్ డే టోర్నమెంట్ లో సెంట్రల్ జోన్ జట్టు రెండవ స్థానంలో నిలిచింది. అయితే ఫైనల్‌లో నార్త్ జోన్‌తో ఓడిపోయింది.[16]
2022–23 సీజన్ కోసం ప్రకటించిన జట్టు ఆధారంగా. బోల్డ్‌లో ఉన్న ఆటగాళ్లకు అంతర్జాతీయ క్యాప్‌లు ఉంటాయి.[17][18]
పేరు | జాతీయత | దేశీయ జట్టు | గమనికలు |
---|---|---|---|
పూనమ్ యాదవ్ | భారతదేశం | రైల్వేలు | కెప్టెన్ |
జసియా అక్తర్ | భారతదేశం | రాజస్థాన్ | |
నీలం భరద్వాజ్ | భారతదేశం | ఉత్తర ప్రదేశ్ | |
ఏక్తా బిష్త్ | భారతదేశం | ఉత్తరాఖండ్ | |
ఆయుషి గార్గ్ | భారతదేశం | రాజస్థాన్ | |
అరుషి గోయెల్ | భారతదేశం | ఢిల్లీ | |
దయాళన్ హేమలత | భారతదేశం | రైల్వేలు | |
రాశి కనోజియా | భారతదేశం | ఉత్తర ప్రదేశ్ | |
తనూజ కన్వర్ | భారతదేశం | రైల్వేలు | |
దిశా కసత్ | భారతదేశం | విదర్భ | |
ముస్కాన్ మాలిక్ | భారతదేశం | ఉత్తర ప్రదేశ్ | |
సుమన్ మీనా | భారతదేశం | రాజస్థాన్ | |
మోనా మేష్రం | భారతదేశం | రైల్వేలు | |
కంచన్ పరిహార్ | భారతదేశం | ఉత్తరాఖండ్ | |
నుజాత్ పర్వీన్ | భారతదేశం | రైల్వేలు | వికెట్ కీపర్ |
స్వాగతికా రథ్ | భారతదేశం | రైల్వేలు | |
అరుంధతి రెడ్డి | భారతదేశం | రైల్వేలు | |
ఇంద్రాణి రాయ్ | భారతదేశం | రైల్వేలు | |
శిల్పా సాహు | భారతదేశం | ఛత్తీస్‌గఢ్ | |
అంజలి శర్వణి | భారతదేశం | రైల్వేలు | |
అనుష్క శర్మ | భారతదేశం | మధ్యప్రదేశ్ | |
అంజలి సింగ్ | భారతదేశం | ఉత్తర ప్రదేశ్ | |
నికితా సింగ్ | భారతదేశం | మధ్యప్రదేశ్ | |
సోనాలి సింగ్ | భారతదేశం | ఉత్తర ప్రదేశ్ | |
పూనమ్ సోని | భారతదేశం | మధ్యప్రదేశ్ | |
కోమల్ జంజాద్ | భారతదేశం | విదర్భ |
బుతువు | లీగ్ స్టాండింగ్‌లు [19] | గమనికలు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
P | W | L | DWF | DLF | ND | BP | Pts | Pos | ||
2014–15 | 4 | 0 | 0 | 3 | 1 | 0 | 0 | 10 | 1వ | ఛాంపియన్స్ |
2015–16 | 4 | 1 | 0 | 2 | 1 | 0 | 1 | 14 | 1వ | ఛాంపియన్స్ |
2016–17 | 4 | 2 | 0 | 2 | 0 | 0 | 1 | 19 | 1వ | ఛాంపియన్స్ |
2017–18 | 4 | 1 | 2 | 0 | 1 | 0 | 0 | 7 | 4వ |
బుతువు | లీగ్ స్టాండింగ్‌లు | గమనికలు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|
P | W | L | T | NR | NRR | Pts | Pos | ||
2022–23 | 5 | 5 | 0 | 0 | 0 | +2.472 | 20 | 1వ | ఛాంపియన్స్ |
బుతువు | లీగ్ స్టాండింగ్‌లు | గమనికలు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|
P | W | L | T | NR | NRR | Pts | Pos | ||
2022–23 | 5 | 4 | 1 | 0 | 0 | +1.870 | 16 | 2వ | ఫైనల్‌లో ఓడిపోయింది |