సెల్ఫీ రాజా | |
---|---|
దర్శకత్వం | జీ ఈశ్వర్ రెడ్డి |
నిర్మాత | చలసాని రామబ్రహ్మం చౌదరి, అనిల్ సుంకర |
తారాగణం | అల్లరి నరేష్, సాక్షి చౌదరి, కామ్నా రణావత్ |
ఛాయాగ్రహణం | లోక్ నాథ్ |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థలు | ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గోపీ ఆర్ట్స్ |
విడుదల తేదీ | 15 జూలై 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సెల్ఫీ రాజా 2016లో విడుదలైన తెలుగు సినిమా. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గోపీ ఆర్ట్స్ బ్యానర్‌పై చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మించిన ఈ సినిమాకు జి. ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అల్లరి నరేష్, సాక్షి చౌదరి, కామ్నా రణావత్, బలిరెడ్డి పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 15 జులై 2016న విడుదలైంది.[1]
రాజా (అల్లరి నరేష్)కు సెల్ఫీలంటే పిచ్చి. తను తీసుకునే సెల్ఫీలతో ఎప్పుడు పక్కవాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో శ్వేతా(కామ్నారనావత్) ని ప్రేమించి ఆమె తండ్రి పోలీస్ కమీషనర్ (నాగినీడు) అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తరువాత రాజాకు వేరే అమ్మాయిలతో సంబంధాలున్నాయని అతడిని వదిలి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో రాజాకు జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోవాలనుకొని తనను చంపమని రౌడీ కాకి (రవిబాబు)కి కాంట్రాక్టు ఇస్తాడు. ఐతే శ్వేత రాజా గురించి నిజం తెలుసుకుని తిరిగి వస్తుంది. భార్య తిరిగి రావటంతో తనను చంపొద్దని రాజా కాకితో చెబుతాడు కానీ, కాకి మాత్రం చంపే తీరుతానని అతణ్ని చంపడం కోసం తిరుగుతుంటాడు. తరువాత ఏమి జరిగిందనే మిగతా సినిమా కథ.[2]