సేవకుడు | |
---|---|
![]() సేవకుడు సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | వి. సముద్ర |
రచన | స్వామీజీ - విజయ్ |
నిర్మాత | ముత్తినేని సత్యనారాయణ |
తారాగణం | శ్రీకాంత్, ఛార్మీ కౌర్ |
ఛాయాగ్రహణం | ఎం. సుధాకర్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | శ్రీకాంత్ దేవా |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకట రమణ ఆర్ట్ ప్రొడక్షన్స్ స్టూడియో |
విడుదల తేదీ | 4 జనవరి 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సేవకుడు, 2013 జనవరి 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకట రమణ ఆర్ట్ ప్రొడక్షన్స్ స్టూడియో బ్యానరులో ముత్తినేని సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు వి. సముద్ర దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీకాంత్, ఛార్మి కౌర్ నటించగా శ్రీకాంత్ దేవా సంగీంతం అందించాడు. ఇది 2014లో తమిళంలో ఇని ఓరు విధి సీవోమ్గా విడుదలైంది.[1]
2010లో శ్రీకాంత్, విమలా రామన్ ప్రధాన పాత్రలలో ఈ సినిమా ప్రారంభించబడింది. కొన్ని కారణాల వల్ల రామన్ స్థానంలో ఛార్మీ కౌర్ తీసుకున్నారు.[2] షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ సినిమా 2013లో విడుదలైంది.[3] ఇందులో అతిథి పాత్రలను పోషించడానికి మంజుల ఘట్టమనేని, కృష్ణ అంగీకరించారు.[4]
ఈ సినిమాకు శ్రీకాంత్ దేవా సంగీతం అందించాడు.[5] అభినయ శ్రీనివాస్, గురుచరణ్. తైదల బాపు, ఈశ్వర్ తేజ, విష్ణువర్మ పాటలు రాశారు.[6]
ఈ సినిమా 2012 ఫిబ్రవరిలో విడుదలకావాల్సి ఉండగా, 2013 జనవరిలో విడుదలైంది.[4] టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సినిమాకి 1.5/5 రేటింగ్ ఇచ్చింది.[7] న్యూస్ 18 ఈ సినిమాకి మిశ్రమ స్పందన రాసింది.[8]
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)