రకం | భారతదేశానికి చెందిన పురుషుల హక్కుల సంస్థ |
---|---|
స్థాపన | 2007 |
స్థలం | Over 50 cities in 20 states[1] |
నిర్వాహకులు | |
జనరల్ సెక్రటరి - రుక్మా చారి; | |
నాగపూర్ - రాజేష్ వఖారియా; | |
రంగం | పురుషుల హక్కులు, గృహహింస |
వెబ్-సైటు |
పురుషులపై హింస |
---|
హింస |
హత్య |
అవయవ తొలగింపు |
లైంగిక హక్కులు హరించివేయటం |
అత్యాచారం |
అక్రమ తరలింపు |
సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (ఆంగ్లం: Save Indian Family Foundation లేదా SIFF) పురుషుల హక్కుల కోసం పోరాడే భారతదేశానికి చెందిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక సాంఘిక ప్రయోగాల నుండి పురుషులను, వారి కుటుంబాలను SIFF రక్షిస్తుంది.[2]
స్త్రీ సాధికారత పేరుతో భారీ ఎత్తున ఉల్లంఘించబడుతోన్న పౌర స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి అవగాహన కలిగించటం. పురుషజాతి త్యజించదగినది అనే అభిప్రాయానికి చరమగీతం పాడటానికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కృషి చేస్తుంది. పురుషులు మృత్యువాత పడటం స్త్రీల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్ననూ, లింగ సమానత్వం గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రస్తావన రాదు అని ఎత్తిచూపుతుంది. SIFF గృహహింస, వరకట్న వేధింపు చట్టాల దుర్వినియోగం బారిన పడిన పురుషులకు మద్దతునిస్తుంది. భారతదేశంలోని అన్ని చట్టాలలో లింగ సమానత్వం ఉండేలా చేయాలని SIFF భావిస్తుంది.
భర్త పట్ల క్రౌర్యం అనే చట్టపరమైన తీవ్రవాదం వలన అనేక మంది పురుషులు కేసులలో ఇరుక్కుపోతున్నారు. జైలుపాలు అవుతోన్నారు. వీరి కుటుంబంలోని స్త్రీలు, పిల్లలు దీని వలన బెదిరిపోతున్నారు. పురుషుడు ప్రమాదంలో ఉంటే, ఆ కుటుంబం ప్రమాదంలో ఉన్నట్లే. పురుషులకు సంఘంలో సరైన గౌరవ మర్యాదలు లేనప్పుడు, ఆ కుటుంబం నాశనమైపోతుంది. అమాయక పురుషులను చెరసాలపాలు కాకుండా రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ సంఘంలో పురుషద్వేషం వేళ్ళూనుకుపోయింది. ఒక పిచ్చికుక్కపై రాళ్ళు విసిరితే గగ్గోలు పెట్టే ఉద్యమాలు, సంఘాలు ఉన్నవి; కానీ తప్పుడు వరకట్న/గృహహింస, మానభంగ వేధింపు కేసులలో ఇరుక్కుపోయిన పురుషులపై ప్రసార మాధ్యమాల విచారణే యదార్థం అనుకొని పురుషుల పుంసత్వాన్ని తొలగించాలి, నట్టనడివీధిలో అందరి ముందు కొట్టి చంపాలి అని ఈ సంఘం భావిస్తోంది. చెదురుముదురుగా ఈ సంఘటనలు జరిగిననూ చట్టపరంగా ఎటువంటి చర్యలూ తీసుకొనబడలేదు.
పాశ్చాత్య ప్రభావం పెరిగిపోవటం వలన పట్టణ ప్రాంతాలలో వైవాహిక వ్యవస్థ నీరుగారిపోతున్నది. భారతీయ వివాహ వ్యవస్థను రక్షించటానికి, మత సంస్థలు, మేధావులు తమకు వీలున్న సహాయ సహకారాలను అందించాలి.
పురుషుడు ఎప్పుడూ శక్తిమంతునిగా చిత్రీకరించబడ్డాడు. మరొక వైపు సభ్య సమాజం నుండి పురుషునికి లభించే స్నేహహస్తం అరుదే. ఇటువంటి పురుషుడు తప్పుడు కేసులలో ఇరుక్కొన్నప్పుడు, అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అతనిలో ఆత్మహత్య ఆలోచనలు కలుగవచ్చును. పురుషులలో ఈ ఆలోచనలను తరిమికొట్టి, వారు నిత్యజీవితాన్ని పున:ప్రారంభించటానికే SIFF కాన్ఫిడేర్ అనే సంస్థను ప్రారంభించింది.
2011 లో ప్రారంభమైన కాన్ఫిడేర్ కార్యాలయంలోకి ఏ పురుషుడైనా తన సమస్యలతో రావచ్చును. తన భావోద్వేగాలను ప్రకటించకొనవచ్చును. నిపుణులు వీరికి సలహాలు సూచనలు అందిస్తారు.
విడాకులు సర్వసాధారణం అయిన నేటి పరిస్థితులలో వైవాహిక సమస్యలను ఎలా అధిగమించాలనే అంశాలపైన కాన్ఫిడేర్ పెళ్ళి చేసుకోబోయే యువకులని చైతన్యపరుస్తూ ఉంటుంది కూడా.