ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సై | |
---|---|
దర్శకత్వం | రాజమౌళి |
రచన | రత్నం (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | రాజమౌళి |
కథ | కె. వి. విజయేంద్ర ప్రసాద్ |
నిర్మాత | ఎ. భారతి |
తారాగణం | నితిన్ జెనీలియా డిసౌజా శశాంక్ ప్రదీప్ రావత్ |
ఛాయాగ్రహణం | సెంథిల్ కుమార్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | శ్రీ భారత్ ఎంటర్ ప్రైజెస్ |
పంపిణీదార్లు | శ్రీ భారత్ ఎంటర్ ప్రైజెస్ |
విడుదల తేదీ | సెప్టెంబరు 23, 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹8 crore (equivalent to ₹24 crore or US$3.0 million in 2020)[1] |
బాక్సాఫీసు | ₹12 crore (equivalent to ₹36 crore or US$4.5 million in 2020)(share) |
సై 2004 లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. నితిన్, జెనీలియా, శశాంక్ ప్రధాన పాత్రలు పోషించారు.[2] సై చిత్రానికీ కధ విజయేంద్ర ప్రసాద్ అందించగా, సంగీతం ఎం ఎం కీరవాణి అందించాడు.ఈ చిత్రం సెప్టెంబర్ 23 న విడుదల అయింది.
పృథ్వి, శశాంక్ హైదరాబాదులోని ఓ కళాశాలలో రెండు విద్యార్థి వర్గాలకు నాయకులు. ప్రతి విషయంలోనూ పోటీ పడుతూ ఒకరిని ఓడించడానికి ఒకరికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. వీళ్ళకి రగ్బీ ఆట అంటే ఇష్టం. ఒక రోజు లోకల్ మాఫియా డాన్ అయిన భిక్షు యాదవ్ వచ్చి ఆ కళాశాల స్థలాన్ని దాని వారసుల నుంచి కొన్నట్లుగా లీగల్ నోటీస్ చూపిస్తాడు. అప్పటి దాకా ఒకరంటే ఒకరికి పడని పృథ్వి, శశాంక్ కాలేజీ స్థలాన్ని కాపాడుకోవడానికి చేతులు కలుపుతారు. తమ స్థలాన్ని తమకు వదిలేయమని తమ తెలివి తేటలు ఉపయోహించి భిక్షు యాదవ్ ని నానా రకాలుగా ఇబ్బందులు పెడతారు. ఇది సహించలేని భిక్షు యాదవ్ రగ్బీ ఆటలో తమను ఓడిస్తే స్థలాన్ని అలాగే వదిలేస్తానని సవాలు విసురుతాడు. పృథ్వి అతని బృందం కలిసి భిక్షు యాదవ్ ని ఓడించి ఎలా తమ కాలేజీని సొంతం చేసుకున్నారన్నది మిగతా కథ.
ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)