సైతువాల్ జిల్లా | |
---|---|
మిజోరాం రాష్ట్ర జిల్లా | |
![]() మిజోరాంలోని ప్రాంతం ఉనికి | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
ముఖ్య పట్టణం | సైతువాల్ |
Government | |
• లోక్‌సభ నియోజకవర్గం | మిజోరాం లోక్‌సభ నియోజకవర్గం |
జనాభా | |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
సైతువాల్ జిల్లా, మిజోరాం రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఒక జిల్లా. 2019, జూన్ 3 నుండి ఈ జిల్లా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.[1]
1974 నుండి సైతువాల్ జిల్లా ఏర్పాటు డిమాండ్ ప్రారంభమయింది.[2] 1993లో సిటిజెన్ కమిటీ స్థాపించబడింది. అనేక ఇతర కమిటీలు, సంఘాలు అన్ని కలిసి సైతువాల్ జిల్లా ఏర్పాటు డిమాండ్ కమిటీగా[3] ఏర్పడ్డాయి. ఆ కమిటీ అధ్వర్యంలో నిరసనలు, బంద్‌లు, ర్యాలీలు, సమావేశాలు మొదలైనవి జరిగాయి.[4] చివరికి, 2008, సెప్టెంబరు 12న సైతువాల్ జిల్లా ఏర్పాటయింది.[5] దీని ముఖ్య పట్టణం సైతువాల్.
జిల్లా ప్రధాన కార్యాలయం సైతువాల్ పేరును జిల్లాకు పెట్టారు.
సైతువాల్ నుండి రాష్ట్ర రాజధాని ఐజాల్ మధ్య దూరం 77 కి.మీ. ఉంటుంది. ఇక్కడినుండి బస్సులు, మాక్సికాబ్స్ లతో రవాణా సౌకర్యం ఉంది.[6]
ఈ జిల్లాలో చల్ఫిల్, షావి, లెంగ్టెంగ్ అనే మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 37 పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. 10,219 కుటుంబాలలో 50,575 మంది నివసిస్తున్నారు. ఇందులో 25,607 మంది పురుషులు, 24,968 మంది మహిళలు ఉన్నారు. జిల్లా రాజధానిలో 2,457 కుటుంబాలు ఉండగా, అక్కడ 11,619 జనాభా నివసిస్తున్నారు.[7]