సైనిక్‌పురి | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°30′06″N 78°33′47″E / 17.501564°N 78.563047°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా |
నగరం | హైదరాబాదు |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500094[1] |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ |
సైనిక్‌పురి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ఈశాన్య భాగంలో ఉన్న ఒక నివాస ప్రాంతం. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా మండల పరిధిలోకి వస్తుంది. ఇది ప్రస్తుతం హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఈస్ట్ జోన్ క్రింద నిర్వహించబడుతోంది.[2][3]
నేరెడ్‌మెట్ గ్రామంలో భాగంగా ఉన్న సైనిక్‌పురి, తరువాతికాలంలో కాలనీగా మారింది. సైనిక్ అంటే సైనికులు అని, పురి అంటే స్థలం అని అర్థం. ఇది, 1960లో రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది కోసం కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వెంచర్‌గా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడ రక్షణ సేవలకు సంబంధించిన వారితోపాటు ఇతర పౌరులు కూడా ఉంటున్నారు.[4]
ఆడిటోరియం, వ్యాయామశాల, బాస్కెట్‌బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్‌లు ఉన్నాయి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో ఇక్కడి ప్రాంతం పచ్చగా ఉంటుంది. మొదట్లో సైనిక్‌పురి కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులకు 700–1,000 చదరపు గజాల స్థలాల్లో హౌసింగ్ ప్లాట్లు కేటాయించడంతో ఇళ్ళ పరిసరాల్లో పెద్ద పచ్చిక బయళ్ళను, అందమైన తోటలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నివసిస్తున్న సాయుధ దళాలలో ఎక్కువమంది పనిచేస్తున్న, విశ్రాంత సభ్యులు కూడా ఉన్నారు.
మొదట్లో సైనిక్‌పురిలో ఎ, బి, సి, డి అనే నాలుగు బ్లాక్‌లు ఉండేవి. 1980ల ప్రారంభంలో అదనపు ప్రాంతం జోడించబడి, ఇ బ్లాక్‌గా ఏర్పడింది. సైనిక్‌పురికి ఉత్తరంవైపున ఇతర నివాస కాలనీలు వచ్చాయి. మాధవ్‌పురి, క్లాసిక్ ఎన్‌క్లేవ్, డాక్టర్ అంబేద్కర్ నగర్ కాలనీ, లక్ష్మీపురి, ఉస్మానియా టీచర్స్ కాలనీ, సాయిబాబా ఆఫీసర్స్ కాలనీ, భాస్కర్ రావు నగర్, ఈశ్వరీపురి కాలనీ, హెచ్‌ఎమ్‌టి బేరింగ్స్ ఆఫీసర్స్ కాలనీ, సూర్యానగర్ గార్డనీ, షైలీ గార్డెన్స్, మానిక్ సాయి ఎన్క్లేవ్, తులసి గార్డెన్స్, మారుతి గార్డెన్స్, సిల్వాన్ గ్రీన్స్, యాప్రాల్ రెసిడెన్షియల్ ఏరియా మొదలైనవి ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
ఇక్కడ ఫిలికో బుక్స్ గ్రంథాలయం ఉంది. ఇందులో 5వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ప్రతినెలా మరికొన్ని పుస్తకాలు చేర్చబడుతున్నాయి. మంగళవారం తప్ప, వారంలోని అన్ని రోజులలో ఈ గ్రంథాలయం తెరిచి ఉంటుంది.[5]
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)