సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్ | |
---|---|
నినాదం | మీ భద్రతే మా బాధ్యత |
ఏజెన్సీ అవలోకనం | |
ఏర్పాటు | 2003 |
అధికార పరిధి నిర్మాణం | |
కార్యకలాపాల అధికార పరిధి | సైబరాబాదు, తెలంగాణ, భారతదేశం |
చట్టపరమైన అధికార పరిధి | రంగారెడ్డి జిల్లా |
ప్రధాన కార్యాలయం | గచ్చిబౌలి, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ |
ఏజెన్సీ అధికారులు |
|
మాతృ ఏజెన్సీ | తెలంగాణ పోలీసు |
వెబ్‌సైట్ | |
అధికారిక వెబ్‌సైటు |
సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్ తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గచ్చిబౌలిలో ఉన్న పోలీసు కమిషనరేట్. ఇది 2003లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను విభజించడం ద్వారా ఏర్పడింది.[1][2]
సైబరాబాద్ పోలీసును 2003 లో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం కింద స్థాపించారు. దీని అధికార పరిధి రంగారెడ్డి జిల్లాలోని సైబరాబాద్ ప్రాంతం వస్తుంది. దీని ప్రధాన కార్యాలయం గచ్చిబౌలిలో ఉంది.
సైబరాబాద్ పోలీస్ విభాగంలో మూడు కార్యాచరణ జోన్లున్నాయి. అవి మాదాపూర్, బాలానగర్, శంషాబాద్. మాదాపూర్ మండలంలో కూకట్ పల్లి, మియాపూర్, మాదాపూర్ డివిజన్లు, బాలానగర్ మండలంలో బషీరాబాద్, బాలానగర్ డివిజన్లు, శంషాబాద్ మండలంలో రాజేంద్ర నగర్, షాద్ నగర్, శంషాబాద్, చేవెళ్ల డివిజన్లు ఉన్నాయి. సైబరాబాద్ పోలీసులకు మాదాపూర్, బాలానగర్, శంషాబాద్‌లో మూడు జోన్‌లతో కూడిన ట్రాఫిక్ వింగ్ కూడా ఉంది.
2019 హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం సైబరాబాద్ పోలీసు అధికారులు ప్రణాళిక ప్రకారం చేసిన హత్య అని విచారణ కమిషన్ న్యాయమూర్తి వి. ఎస్. సిర్పుర్కర్ ప్రకటించారు.[4] హేమాంగి శర్మ మోసం కేసులో సైబరాబాద్ పోలీసులు నకిలీ సాక్షులు, నకిలీ అఫిడవిట్లు, నకిలీ పంచనామా సహాయంతో తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు, తప్పుడు ఛార్జ్ షీట్‌లు నమోదు చేశారని ఒడిషా కవి తపన్ కుమార్ ప్రధాన్ సోషల్ మీడియాలో ఆరోపించాడు.[5]
సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్ అధికారిక వెబ్సైటు Archived 2020-12-10 at the Wayback Machine