సోనాల్ కౌశల్ | |
---|---|
జననం | 21 జూన్ 1991 |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | ది మోటార్ మౌత్[1] |
వృత్తి | వాయిస్ ఆర్టిస్టు / డబ్బింగ్ ఆర్టిస్టు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | డోరేమాన్ హిందీ వాయిస్ |
జీవిత భాగస్వామి |
ఉత్కర్ష్ బలి (m. 2020) |
సోనాల్ కౌశల్ భారతీయ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, చిన్నపిల్లల ధారావాహిక డోరేమాన్‌లో ప్రధాన పాత్ర అయిన డోరేమాన్ కు గాత్రదానం చేసి ప్రసిద్ధి చెందింది.
ఆమె పలు కార్టూన్ ధారావాహికలలో అనేక పాత్రలకు గాత్రదానం చేసినందున ఆమెను ది మోటర్ మౌత్ అని గుర్తింపుతెచ్చుకుంది. ఆమె బంద్‌బుద్ ఔర్ బుడ్‌బాక్‌లో బుద్‌దేవ్, లిటిల్ సింఘంలో బబ్లీ.. ఇలా మరెన్నో పాత్రలకు డబ్బింగ్ ఆర్టిస్గ్ గా చేసింది.[2][3]
పవర్ రేంజర్స్ మెగాఫోర్స్, పవర్ రేంజర్స్ సూపర్ మెగాఫోర్స్‌లలో ఎమ్మా గూడాల్ వాయిస్ ఆమె చేసింది. ఆమె మాలిబు రెస్క్యూ, మాలిబు రెస్క్యూ: ది నెక్స్ట్ వేవ్, మాలిబు రెస్క్యూ టీవీ సిరీస్‌లలో గినాకు కూడా గాత్రదానం చేసింది. ఆమె జానీ టెస్ట్, దాని పునరుద్ధరణ కార్యక్రమంలో కూడా హిందీ డబ్బింగ్ వాయిస్ అందించింది.
సోనాల్ కౌశల్ డబ్బింగ్ కెరీర్ 8 ఏళ్ల వయసులో మొదలుపెట్టింది. 2005లో ఆమె డబ్బింగ్ చెప్పిన పాత్ర డోరేమాన్. దీంతో ఆమె ఒక్కసారిగా వేలాది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె దిమోటర్మౌత్ (TheMotorMouth) పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది, అక్కడ ఆమె వివిధ పాత్రలకు గాత్రదానం చేయడంతో పాటు ఇతర వాయిస్ ఆర్టిస్టులను కూడా ఇంటర్వ్యూ చేసింది.[4] 2023లో స్టూడియో 88 పిక్చర్స్ ద్వారా స్టార్ వార్స్ విజన్స్ సీజన్ 2లో బండిట్స్ ఆఫ్ గోలక్ అనే షార్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ లో ఆమె ప్రధాన పాత్ర రాణికి గాత్రదానం చేసింది.[5][6]
సంవత్సరం | సీరియల్ | పాత్ర | నోట్స్ |
---|---|---|---|
2005–2020 | డోరేమాన్ | డోరేమాన్ | |
2015–ప్రస్తుతం | బంద్‌బుద్ ఔర్ బుడ్‌బాక్ | బుద్ధదేవ్ | |
2019–ప్రస్తుతం | లిటిల్ సింగం | బబ్లీ | |
2020–ప్రస్తుతం | పినాకి అండ్ హ్యాపీ | పినాకి, టిటూ | |
2010-ప్రస్తుతం | ఛోటా భీమ్ | భీమ్ | |
2023 | స్టార్ వార్స్: విజన్స్ | రాణి | ఎపిసోడ్: "ది బాండిట్స్ ఆఫ్ గోలక్" |
సినిమా | నటుడు | పాత్ర | భాష | సంవత్సరం |
---|---|---|---|---|
ప్రీకీ అలి | ఎమీ జాక్సన్ | మేఘా | హిందీ | 2016 |
ది బాడీ | వేదిక | తు/ఇషా | హిందీ | 2019 |