వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | మలకాండ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్ | 1984 మార్చి 6|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | సోహైల్ పఠాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 4 అం. (193 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 191) | 2009 ఫిబ్రవరి 21 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2016 డిసెంబరు 26 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 164) | 2008 జనవరి 30 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2016 అక్టోబరు 5 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 14 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 26) | 2008 అక్టోబరు 10 - Canada తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2017 అక్టోబరు 18 - World XI తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007/08– | Sindh | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007/08 | Sui Southern Gas Corporation | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017; 2019 | కరాచీ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | లాహోర్ కలందర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | క్వెట్టా గ్లేడియేటర్స్ (స్క్వాడ్ నం. 99) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | Multan Sultans | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | పెషావర్ జాల్మి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPN Cricinfo, 2022 సెప్టెంబరు 6 |
సోహైల్ ఖాన్ (జననం 1984, మార్చి 6) పాకిస్తానీ మాజీ క్రికెటర్. ఇతనిని సోహైల్ పఠాన్ అని కూడా పిలుస్తారు.[2] కుడిచేతి ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. ఇతను 2007లో తన తొలి ఫస్ట్-క్లాస్ సీజన్‌లో ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో పాకిస్థానీ అత్యుత్తమ బౌలింగ్ చేసిన వ్యక్తిగా ఫజల్ మహమూద్ రికార్డును బద్దలు కొట్టడంతో తక్షణ గుర్తింపు పొందాడు.[3] కొంతకాలం తర్వాత అతను జింబాబ్వేతో జరిగిన వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2015 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఖాన్ జట్టులో భాగంగా ఉన్నాడు.[4]
సోహైల్ ఖాన్ ఖైబర్ 1984, మార్చి 6న పఖ్తుంఖ్వాలోని మలాకాండ్ జిల్లా సఖాకోట్‌లో పుట్టి పెరిగాడు. చిన్న వయస్సు నుండి టెన్నిస్-బాల్ క్రికెట్ ఆడాడు. చురుకైన వేగంతో బౌలింగ్ చేసాడు. పర్వత వాతావరణంలో ఉన్న నదులు, ప్రవాహాలలో రాళ్ళు విసరడం, ఈత కొట్టడం వల్ల కండరాల బలం వచ్చిందని చెప్పాడు. ఇతని సామర్థ్యాన్ని గుర్తించి, స్నేహితుడి సలహా మేరకు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేందుకు కరాచీకి వెళ్ళాడు.[5] ఇతని సోదరుడు మురాద్ ఖాన్ మోడలింగ్ వైపు వెళ్ళడానికి ముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.
ఖాన్ 2007/08 క్వాయిడ్-ఎ-ఆజం ట్రోఫీలో పాకిస్తాన్ కస్టమ్స్‌పై ఎస్ఎస్జీసి తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. అరంగేట్రంలో తన మొదటి ఇన్నింగ్స్‌లో బంతితో ఆకట్టుకున్నాడు, 25 ఓవర్లలో 59 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 75 పరుగులిచ్చి పది వికెట్లతో ముగించాడు.[6] పోటీలో ఎస్ఎస్జీసి ఆఖరి మ్యాచ్ లో, కరాచీలోని అస్గర్ అలీ షా స్టేడియంలో వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ క్రికెట్ టీమ్ తో జరిగిన మ్యాచ్‌లో 52.5 ఓవర్లలో 16–189 పరుగులతో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో పాకిస్థానీ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల కోసం ఫజల్ మహమూద్ దీర్ఘకాల రికార్డును ఖాన్ బద్దలు కొట్టాడు.[3][7] ఇతను ఎనిమిది ఐదు వికెట్లు, రెండు పది వికెట్ల హాల్‌లతో సహా 18.43 సగటుతో 65 వికెట్లతో పోటీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[8]
2007/08 పెంటాంగ్యులర్ కప్‌లో సింధ్ తరపున ఆడిన ఖాన్, పోటీలో తన జట్టు ప్రారంభ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.[9] ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలో బలూచిస్తాన్, ఫెడరల్ ఏరియాలపై వరుసగా ఐదు వికెట్లు తీసి ఆ ప్రదర్శనను కొనసాగించాడు.[10][11] ఖాన్ తదనంతరం బౌలర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. 16.69 సగటుతో 23 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తన తొలి ఫస్ట్-క్లాస్ సీజన్‌ను 14 మ్యాచ్‌లలో 91 వికెట్లతో ముగించాడు.[12][13]
ఐదు వన్డేల సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఖాన్ పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఒక వికెట్ తీశాడు. 7 ఓవర్లలో 1/38తో ముగించాడు.[14] 2008 ఏప్రిల్ లో సందర్శించిన బంగ్లాదేశీయులతో జరిగిన మూడవ, నాల్గవ వన్డేలలో ఆడాడు. మొదటి మ్యాచ్‌లో వికెట్ లేకుండా, రెండవదానిలో మూడు వికెట్లు తీశాడు.[15][16]
ఖాన్ అరంగేట్రం చేసిన ఐదేళ్ళ తర్వాత టెస్టుల్లోకి తిరిగి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ కు ఎంపికయ్యాడు. ఆతిథ్య జట్టుతో మూడో టెస్టు ఆడాడు, మొదటి ఐదు-ఫెర్ తీసుకున్నాడు. పాకిస్థాన్ 141 పరుగుల తేడాతో ఓడిపోయిన మ్యాచ్‌లో ఇతను 7/207 తీసుకున్నాడు. నాల్గవ, ఆఖరి టెస్టులో ఇతను మళ్ళీ ఐదు-ఫెర్ తీసుకున్నాడు, దీని ఫలితంగా పాకిస్తాన్ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
Sohail Khan, popularly known as Sohail Pathan [...]