సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ (ఎస్ఐబి) (South Indian Bank Limited (SIB) భారతదేశంలోని కేరళ రాష్ట్రము లోని త్రిస్సూరు లో ప్రధాన కార్యాలయం ఉన్న ఒక ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకు. భారతదేశం అంతటా విస్తరించిన శాఖలతో వినియోగదారులకు ఆర్ధిక సేవలను అందిస్తున్న బ్యాంక్.
South Indian Bank Logo | |
రకం | పబ్లిక్ |
---|---|
బి.ఎస్.ఇ: 532218 NSE: SOUTHBANK | |
పరిశ్రమ | బ్యాంకింగ్ ఆర్ధిక సేవలు |
స్థాపన | 29 జనవరి 1929 |
ప్రధాన కార్యాలయం | త్రిస్సూర్, కేరళ, భారతదేశం |
కీలక వ్యక్తులు |
|
ఉత్పత్తులు | క్రెడిట్ కార్డులు, మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారం, డీమ్యాట్ అకౌంట్, వినియోగదారు బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, ఆర్ధిక,ఇన్స్యూరెన్స్, తనఖా రుణం, ప్రైవేట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్ మెంట్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ |
రెవెన్యూ | ₹6,562.64 crore (US$820 million) (2017)[2] |
₹1,214.59 crore (US$150 million) (2017)[2] | |
₹392.50 crore (US$49 million) (2017)[2] | |
Total assets | ₹74,312.15 crore (US$9.3 billion) (2017)[2] |
ఉద్యోగుల సంఖ్య | 7,677 (2017) [2] |
మూలధన నిష్పత్తి | 12.37% [2] |
వెబ్‌సైట్ | www |
దక్షిణ భారతదేశంలోని పురాతన బ్యాంకులలో ఒకటైన సౌత్ ఇండియన్ బ్యాంక్ (ఎస్.ఐ.బి) స్వదేశీ ఉద్యమ సమయంలో స్థాపన జరిగింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ 29 జనవరి 1929 న త్రిస్సూర్ లో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా స్థాపించబడింది, తరువాత 1939 ఆగస్టు 11 న పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చబడింది. ఎస్.ఐ.బి.ని త్రిస్సూరు లోని ఔత్సాహికలు సమాజంలో సురక్షితమైన సమర్థవంతమైన,సేవా ఆధారితముగా ప్రజలకు అందించడానికి, మరోవైపు అత్యాశగల వడ్డీ వ్యాపారుల బారి నుండి వ్యాపారులను కాపాడడానికి, సహేతుకమైన వడ్డీ రేట్లకు అవసరమైన ఆధారిత రుణాన్ని అందించడం కొరకు ఈ బ్యాంక్ లక్ష్యం గా పెట్టుకుని ఏర్పాటు చేయబడింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ 31 డిసెంబర్ 2020 నాటికి దేశవ్యాప్తంగా 877 బ్రాంచీలతో, 1443 ఎటిఎమ్ ల నెట్ వర్క్ తో ఉన్నది.[3]
సౌత్ ఇండియన్ బ్యాంక్ వినియోగదారుల బ్యాంకింగ్ ( పర్సనల్ బ్యాంకింగ్ ) లో కింద డిపాజిట్, పొదుపు, రుణాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డీమ్యాట్ సర్వీసులు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మొదలైన అనేక రకాల వ్యక్తిగత బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. మ్యూచువల్ ఫండ్ సేవలలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎఎంసి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, టాటా మ్యూచువల్ ఫండ్, సుందరం బిఎన్పి పరిబాస్, యుటిఐ మ్యూచువల్ ఫండ్స్, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్, హెచ్ఎస్బిసి ఇన్వెస్ట్మెంట్స్,హెచ్ డి ఎఫ్ సి మ్యూచువల్ ఫండ్, ఫిడిలిటీ ఫండ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్స్, ఫోర్టిస్ ఇన్వెస్ట్మెంట్స్, బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, డిఎస్పి బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్స్ వంటి వివిధ ఫండ్ల మ్యూచువల్ ఫండ్స్ ను బ్యాంక్ అందిస్తుంది.
ఎన్ఆర్ఐ బ్యాంకింగ్- ప్రవాస భారతీయల (ఎన్ఆర్ఐ) ఖాతాదారులకు డిపాజిట్, కారు రుణాలు, రెమిటెన్స్లు, పెట్టుబడి పథకాలు, భీమా వంటి సేవలను అందిస్తుంది.
కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలలో సౌత్ ఇండియన్ బ్యాంక్ వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ ఫైనాన్స్, స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ మొదలైన సేవలను పారిశ్రామిక రంగములో అందిస్తుంది.[4]
ఈ బ్యాంకు భారతదేశంలో అత్యంత అనుకూలమైన చురుకైన బ్యాంకులలో ఒకటిగా పరిగణించబడుతుంది, వినియోగ దారుల సేవల కీలక భాగంలో నిపుణులతో సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన బ్యాంకు గా ఉన్నది. [5]
సౌత్ ఇండియన్ పొందిన అవార్డులు ఈ విధముగా ఉన్నాయి.[6]