వ్యక్తిగత సమాచారం | |||
---|---|---|---|
జనన తేదీ | [1] | 2001 జూలై 18||
జనన ప్రదేశం | కిసాన్‌నగర్ తండా, రేంజల్ మండలం | ||
ఆడే స్థానం | మిడ్ ఫీల్డర్[1] | ||
క్లబ్ సమాచారం | |||
ప్రస్తుత క్లబ్ | గోకులం కేరళ | ||
సీనియర్ కెరీర్* | |||
సంవత్సరాలు | జట్టు | Apps† | (Gls)† |
కెంక్రే | |||
2021- | గోకులం కేరళ | 0 | (0) |
జాతీయ జట్టు‡ | |||
2015 | అండర్ 14 - భారత జట్టు | 1+ | (1) |
2016 | అండర్ 16 - భారత జట్టు | 4 | (3) |
2016–2018 | అండర్ 19 - భారత జట్టు | 3 | (1) |
2021– | భారత ఫుట్‌బాల్ జట్టు | 8 | (0) |
† Appearances (Goals). |
గుగులోత్ సౌమ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారత ఫుట్‌బాల్ క్రీడాకారిణి.[3] ఆమె 2022లో మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విశిష్ట మహిళ పురస్కారంకు ఎంపికైంది.[4]
సౌమ్య 2001 జూలై 18న తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, రేంజల్ మండలం, కిసాన్‌నగర్ తండా లో గుగులోత్ గోపి, ధనలక్ష్మి దంపతులకు మూడో సంతానంగా జన్మించింది. ఆమెకు ఇద్దరు అక్కలు, తమ్ముడు ఉన్నారు. సౌమ్య నిజామాబాద్ కేర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది.[5]
సౌమ్య పాఠశాల దశలో జరిగిన పోటీల్లో పరుగుపందెంలో అద్భుత ప్రతిభ కనబరిచి ఏడో తరగతిలో ఉండగానే జిల్లా అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఆమె 400 మీ., 800 మీ. పరుగులో అద్భుతంగా రాణించన సౌమ్య ప్రతిభను గుర్తించిన నాగరాజు కోచ్ అవతారమెత్తి ప్రత్యేకంగా అకాడమీ ఏర్పాటు చేసి శిక్షణ ప్రారంభించాడు. సౌమ్య ఆడపిల్ల కావడంతో మొదట తల్లిదండ్రులు ఆమెకు ఫుట్‌బాల్ కోచింగ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నాగరాజు ఆమె తల్లితండ్రికి నచ్చజెప్పడంతో అంగీకరించారు. సౌమ్య 2013 నుంచి ఆమె ఫుట్‌బాల్ సాధన చేస్తూ తెలంగాణ రాష్ట్ర అండర్ 14, 15, 16 జట్లకు సౌమ్య ప్రాతినిధ్యం వహించి, అంచెలంచెలుగా ఎదిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించింది.
ఆమె నేపాల్‌లో జరిగిన అండర్ 14 ఫుట్‌బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున తొలిసారిగా ఆడిన సౌమ్య తరువాత చైనాలో అండర్ 16, మయన్మార్లో అండర్ 19 పోటీల్లో ప్రతినిధ్యం వహించి అనంతరం దక్షిణాఫ్రికాలో 2019లో జరిగిన అండర్ 17 పోటీల్లో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించింది.[6] సౌమ్యా అనంతరం ఫిఫా ర్యాంకింగ్ కోసం ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో, బ్రెజిల్‌లో జరిగిన నాలుగు దేశాల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు భారత్ మహిళా ఫుట్‌బాల్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించింది.[7]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)