సిక్కిం స్టేట్ కౌన్సిల్ | |
---|---|
రకం | |
రకం | ఏకసభ |
చరిత్ర | |
తెరమరుగైనది | 1975 |
తరువాతివారు | సిక్కిం శాసనసభ |
నిర్మాణం | |
సీట్లు | 32 |
కాలపరిమితి | 3 సంవత్సరాలు |
ఎన్నికలు | |
రాష్ట్ర మండలి ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ |
రాష్ట్ర మండలి మొదటి ఎన్నికలు | 1953 |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
రాష్ట్ర మండలి చివరి ఎన్నికలు | 1974 |
సమావేశ స్థలం | |
గాంగ్‌టక్, సిక్కిం |
సిక్కిం రాష్ట్ర మండలి అనేది భారతదేశం, చైనా మధ్యహిమాలయాలలో ఉన్న మాజీ సిక్కిం రాజ్యం ఏకసభ శాసనసభ. 1953 -1974 మధ్య కౌన్సిల్ కోసం ఆరు ఎన్నికలు జరిగాయి. 1975లో రాచరికాన్ని రద్దు చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ, భారతరాజ్యాంగానికి 36వ సవరణను ఆమోదించిన తరువాత, రాష్ట్ర మండలితో పాటు రాచరికం రద్దు చేయబడింది. ఈ రాజ్య భూభాగం భారతదేశంలో విలీనం చేయబడింది. దానితో భారతదేశంలో అది 22వ రాష్ట్రంగా మారింది. ఆ సమయంలో రాష్ట్ర మండలి సభ్యులను కొత్తగా ఏర్పడిన రాష్ట్ర శాసనసభ సభ్యులుగా పరిగణించారు.
ఈ మండలిలో కొంతమంది ఎన్నికైన సభ్యులు, కొందరు చోగ్యాల్ నామినేట్ చేసిన సభ్యులు ఉన్నారు.1973 ఎన్నికల తరువాత, కూర్పు మార్చబడింది. చోగ్యాల్ చేసిన నియామకాలు తొలగించబడ్డాయి. అదే సమయంలో మండలిలో స్థానాల సంఖ్య పెరిగింది.[1]
రాష్ట్ర మండలి సభ్యుల నుండి,ఒక కార్యనిర్వాహక మండలిని (మంత్రుల మంత్రివర్గానికి సమానమైంది) చోగ్యాల్ ఎంపిక చేశారు.కార్యనిర్వాహక మండలికి సిక్కిం దివాన్ అధ్యక్షత వహించాడు. దానిలోని ప్రతి సభ్యునికి వ్యక్తిగత ప్రభుత్వ బాధ్యతలు ఇవ్వబడ్డాయి. [2][3]
సిక్కిం రాష్ట్ర మండలి 19వ శతాబ్దం చివరి నుండి ఉనికిలో ఉంది.[4] ఇది ఒక సలహా, కార్యనిర్వాహక సంస్థ. దీనికి చోగ్యాల్ (కింగ్) అధ్యక్షత వహించారు.1947 ఆగస్టులో పొరుగు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సిక్కింలోని వివిధరాజకీయ సంస్థలు రాజ్య పరిపాలనలో ఎక్కువ వాటాఇవ్వాలని వత్తిడి చేయడం ప్రారంభించాయి.[5] 1953లో ఎన్నికల కోసంకొత్తనియోజకవర్గాలను అంగీకరించి,1952లో చోగ్యాల్ ప్రకటించాడు.[2][6]
అప్పటి నుండి మండలిలో 18 సీట్లలో 12 సీట్లను ఎన్నుకోగలమని చోగ్యాల్ అంగీకరించారు. మిగిలిన ఆరుగురిని చోగ్యాల్ నియమించారు. రాజకీయ సమూహాలు అంగీకరించిన సమానత్వ సూత్రం ప్రకారం, ఎన్నిక చేయదగిన సీట్లలో ఆరు సిక్కిం నేపాలీలకు, మిగిలిన ఆరు భూటియా-లెప్చా (బిఎల్) ప్రజలకు ఉండాల్సి ఉంది. రాజ్యంలో నాలుగు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడ్డాయి.1953లో ఎన్నికలు జరగాల్సి ఉంది.[2]1953 ఎన్నికలలో సిక్కిం నేషనల్ పార్టీ అన్ని నేపాలీలకు కేటాయించిన సీట్లను గెలుచుకోగా, సిక్కిం స్టేట్ కాంగ్రెస్ బిఎల్-కేటాయింపు స్థానాలను గెలుచుకుంది.[7]
కౌన్సిల్ పదవీకాలం మూడు సంవత్సరాలుగా నిర్ణయించబడినప్పటికీ, చోగ్యాల్ మొదటి కౌన్సిల్ పదవీకాలాన్ని 1958 వరకు పొడిగించాలని నిర్ణయించాడు.ఆశ్రమ సంఘ, ఇతర సమూహాల అభ్యర్థనల కారణంగా,మండలిలో ఎన్నుకోబడే స్థానాల సంఖ్యను రెండిటికి పెంచారు. వాటిలో ఒకటి సంఘ, సన్యాసులు ఓటు వేయాలి. రెండవది ఏ ప్రత్యేక సమూహానికి కేటాయించని సీటు.[8] 1958 ఎన్నికలలో సిక్కిం రాష్ట్ర కాంగ్రెస్ అదనపు సీటును గెలుచుకోగా, కేటాయించని సీటును స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నాడు.[6]
రెండవ మండలి పదవీకాలం 1961లో ముగియాల్సి ఉంది. కానీ చైనా-భారత యుద్ధం ప్రారంభమవడంతో దాని పదవీకాలం 1967 వరకు పొడిగించబడింది. 1967 ఎన్నికలకు ముందు, నియోజకవర్గాలను తిరిగి పునర్వ్యవస్థీకరించి ఐదుకు పెంచారు.ఇంకా ఎన్నిక చేయదగిన మరో నాలుగు స్థానాలను మండలికి చేర్చారు.సిక్కిం నేపాలీలు, భూటియా-లెప్చాలకు ఒక్కొక్కటి, సోంగ్ ఒకటి, షెడ్యూల్డ్ కులాల ప్రజలకు ఒకటి చొప్పున కెటాయింపు చేసారు.[9][10]
1973 ఎన్నికల తరువాత సిక్కిం నేషనల్ కాంగ్రెస్, సిక్కిం జనతా కాంగ్రెస్ దక్షిణ సిక్కిం నియోజకవర్గంలో ఓట్ల రిగ్గింగ్ జరిగిందని పేర్కొన్నాయి.[11] పాల్గొన్న అధికారులను అరెస్టు చేయాలని వారు వత్తిడిలు చేశారు.కానీ ఈ డిమాండ్లను నెరవేర్చలేదు. దానితో ఇది నిరసనలకు దారితీసింది.[6]ఈ అశాంతి మే 8న చోయ్గల్, సిక్కిం రాజకీయ పార్టీలు, భారత ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయడానికి దారితీసింది. ఈ ఒప్పందం భారత ప్రభుత్వంచే నియమించబడిన ఒక ప్రధాన కార్యనిర్వాహకుడి పర్యవేక్షణలో ఒక ప్రభుత్వ ఏర్పాటుకు దారితీసింది.దీనికి మరో డీలిమిటేషన్ కసరత్తు అవసరమైంది,ఇక్కడ కౌన్సిల్లో చోగ్యాల్ నియమించిన స్థానాలను రద్దు చేశారు, స్టేట్ కౌన్సిల్ను సిక్కిం అసెంబ్లీగా పేరు మారింది. మఠాలకు ఒక నియోజకవర్గంతో పాటు ముప్పై ఒక్క కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు (సంఘ). 1952 నాటి సమానత్వ సూత్రాన్ని అనుసరించి,15 నియోజకవర్గాలు భూటియా-లెప్చాకు, 15 సిక్కిం-నేపాలీలకు కేటాయించబడ్డాయి.మిగిలిన నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాల కోసం ఉండేది."ఒక వ్యక్తి ఒక ఓటు" సూత్రం వర్తించబడింది.[1]1974 ఎన్నికలలో సిక్కిం నేషనల్ కాంగ్రెస్ (సిక్కింను భారతదేశంతో విలీనం చేయడానికి అనుకూలంగా ఉంది) 32 సీట్లలో 31 సీట్లతో సంపూర్ణ మెజారిటీని గెలుచుకుంది.[12]
1974 మేలో, కౌన్సిల్ సిక్కిం ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది.ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి, భారతదేశంతో సంబంధాలను మరింత పెంచడానికి వీలు కల్పించింది.[13] దీని తరువాత, జూలైలో, వారు కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించారు.ఇది దేశాన్ని భారతదేశ రాష్ట్రంగా మార్చడానికి వీలు కల్పించింది. భారత ప్రభుత్వ ఒత్తిడితో చోగ్యాల్ ఈ రాజ్యాంగంపై సంతకం చేశారు.[14] సిక్కింను "అనుబంధ" రాష్ట్రంగా మార్చడానికి అనుకూలంగా లోక్‌సభలో బిల్లు నెగ్గింది. రాజ్యసభ సెప్టెంబరు 8న సవరణకు ఓటు వేసింది.దీనితో సిక్కింకు ఇతర రాష్ట్రాలతో సమానమైన హోదా కల్పించింది. దానిని భారత యూనియనులో విలీనం చేసింది.[15][16] సెప్టెంబరు 8న, చోగ్యాల్ "బిల్లుపై సిక్కింలో విస్తృతంగా ఉన్న అనుమానాలను" ఉదహరించి, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చారు. సిక్కిం విద్యార్థుల సంఘం ప్రజాభిప్రాయ సేకరణకు అతను చేసిన పిలుపుకు ప్రతిధ్వనించింది.[17]
1975 మార్చిలో, సిక్కిం నేషనల్ కాంగ్రెస్ భారతదేశంలో విలీనానికి తన పిలుపులను పునరావృతం చేసింది,అయితే చోగ్యాల్ మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చారు. [14]1975 ఏప్రిల్ 9న భారతదళాలు దేశంలోకి ప్రవేశించి,రాజభవనం రక్షకభటులను నిరాయుధులను చేశారు.(వారిలో ఒకరిని చంపి,మరో నలుగురిని గాయపరిచారు) రాజభవనాన్ని చుట్టుముట్టారు.రాజును గృహనిర్బంధంలో ఉంచారు.[18] మరుసటి రోజు, కౌన్సిల్ ఒక బిల్లును ఆమోదించింది.చోగ్యాల్ కార్యాలయం రద్దు చేయబడిందని ప్రకటించింది.ఈ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది.ఇది నాలుగు రోజుల తర్వాత జరగాల్సి ఉంది.[19] ఏప్రిల్ 14న ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.ఫలితంగా రాచరికం రద్దుకు అనుకూలంగా 97% కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.[20] ఏప్రిల్ 26న భారత పార్లమెంటు రాజ్యాంగంలోని 36వ సవరణను ఆమోదించింది.దీనితో సిక్కిం భారత రక్షణ ప్రాంతం నుండి భారత రాష్టాల సమాఖ్యలో కొత్త రాష్ట్రంగా మారింది. [21] [22] [23]
మే 15న, భారత అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సిక్కింను భారతదేశంలోని 22వ రాష్ట్రంగా చేసిన రాజ్యాంగ సవరణను ఆమోదించి,చోగ్యాల్ స్థానాన్ని రద్దు చేశారు.[24] రాష్ట్ర మండలిని రద్దు చేసి,దాని సభ్యులను సిక్కిం కొత్త శాసనసభ సభ్యులుగా పరిగణించారు.[25]దీని తరువాత, బి. బి. లాల్ మే 16న రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు స్వీకరించారు.[26]
ఎన్నికల
సంవత్సరం |
స్వాతంత్య్రానికి
అనుకూలం |
ప్రో-విలీనం [a] | ఇతరాలు/తెలియనివి |
మొత్తం | |
---|---|---|---|---|---|
నియామకం. | ఎస్ఎన్పీ | ||||
1953 | 6 | 6 | 6 | 0 | 18 |
1958 | 6 | 7 | 1 | 20 | |
1967 | 5 | 10 | 3 | 24 | |
1970 | 8 | 7 | 3 | ||
1973 | 9 | 7 | 2 | ||
1974 | 0 | 1 | 31 | 0 | 32 |
గమనికలు
సంవత్సరం. | వివరాలు | నియోజకవర్గాలు | సీట్లు | ఎన్నికలు | ||||
---|---|---|---|---|---|---|---|---|
నేపాలీ | బిఎల్ | ఇతరులు | నియామకం. | మొత్తం | ||||
1952 | కొత్త రాష్ట్ర మండలి కోసం ఎన్నికలు ప్రకటించబడ్డాయి, 12 మంది (18 మంది ఎన్నికైన సభ్యులలో) ఉన్నారు.[2] | 4 | 6 | 6 | 0 | 6 | 18 | 1953 |
1958 | రాష్ట్ర మండలిలో సీట్లను 20కి పెంచారు.[8] | 4 | 6 | 6 | 2 [a] | 6 | 20 | 1958 |
1966 | "సిక్కిం విషయాల ప్రాతినిధ్యం నియంత్రణ, 1966" ఆమోదించబడింది.[10] మండలిలో నియోజకవర్గాల సంఖ్యను 5కి పెంచారు. |
5 | 7 | 7 | 4 | 6 | 24 | 1967, 1970,1973 |
1974 | "సిక్కిం ప్రభుత్వం చట్టం, 1974" ఆమోదించబడింది.[1] బహుళ సీట్ల నియోజకవర్గాలు తొలగించబడ్డాయి. |
32 | 15 | 15 | 2 [c] | 0 | 32 | 1974 |
The Dewas shall be the president of the Executive Council ...
The defeated parties alleged polling in Rabong, in South Sikkim, was rigged in the favour of the SNP candidate
The First Sikkim Assembly formed through the election held in 1974 with 32 members is deemed to be the First Legislative Assembly of Sikkim ... Sikkim Congress led by Kazi Lhendup Dorjee won 31 seats and one seat went in favour of Sikkim National Party.
... the Assembly for Sikkim formed as a result of the elections held in Sikkim in April, 1974 ... shall be deemed to be the Legislative Assembly of the State of Sikkim