స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర భారతీయ స్టేట్ బ్యాంకు లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏడు అనుబంధ బ్యాంకులలో ఒకటి. భారతదేశపు జాతీయ బ్యాంకులలో ఒకటిగా కొనసాగుతుంది.ఇది ప్రస్తుతం స్టేట్ బ్యాంకు గ్రూపుకు చెందిన మాతృ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకులో విలీనమైంది.
1948 కి ముందు ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో భాగమైన సౌరాష్ట్ర ప్రాంతం అనేక చిన్న, మధ్య, పెద్ద రాచరిక రాష్ట్రాలను కలిగి ఉంది. పెద్ద రాష్ట్రాలలో ఉన్న భావ్‌నగర్, రాజ్‌కోట్, పోర్‌బందర్, రెండు చిన్న రాష్ట్రాలైన పాలిటానా, వాడియా రాచరిక రాష్ట్రాలు తమ సొంత దర్బార్ (ప్యాలెస్ ) సేవింగ్స్ బ్యాంకులను స్థాపించాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర వీటిలో పురాతనమైంది.ఇది (భావ్‌నగర్ దర్బార్ సేవింగ్స్ బ్యాంక్) 1902 ఏప్రిల్ 1 న సౌరాష్ట్ర ప్రాంతంలోని రాచరిక రాష్ట్రాలలో ఒకటైన భావ్‌నగర్‌లో స్థాపించారు.దీని ప్రధాన కార్యాలయం సౌరాష్ట్ర (గుజరాత్) లోని భావ్‌నగర్ లో ఉంది.[1] ఈ బ్యాంకును మహారాజా సర్ భావసింగ్జీ తకత్ సిన్హజీ గోహిల్, తరువాత దివాన్ సర్ ప్రభాశంకర్ పట్టాని స్థాపించారు.[1]దర్బారీ సేవకులలో పొదుపు అలవాట్లను ప్రోత్సహించడానికి, వారి ఇతరుల పెట్టుబడులకు సురక్షితమైన స్థలాన్నిఅందించాలనే ఆశయంతో అప్పట్లో ఈ బ్యాంక్ సృష్టించబడింది.[1]
ఈ బ్యాంకులు ప్రధానంగా ఆయా రాచరిక రాష్ట్రాల ప్రభుత్వాల అవసరాలను, స్థానిక ప్రజల పొదుపుఖాతాల డిపాజిటరీలుగా పనిచేశాయి.1948 లో సౌరాష్ట్ర రాష్ట్రం స్థాపించబడిన తరువాత ఈ బ్యాంకులపై సమాంతర సమ్మేళనం జరిగింది.దాని పలితంగా భావ్‌నగర్ దర్బార్ బ్యాంక్ సౌరాష్ట్ర స్టేట్ బ్యాంక్స్ (సమ్మేళనం) ఆర్డినెన్స్,1950 (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (అనుబంధ బ్యాంకులు) చట్టం, 1959 లోని 3 వ షెడ్యూల్ ద్వారా సౌరాష్ట్ర స్టేట్ బ్యాంక్స్ (సమ్మేళనం) ఆర్డినెన్స్ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రగా మారింది.రాజ్కోట్ స్టేట్ బ్యాంక్, పోర్బందర్ స్టేట్ బ్యాంక్, పాలిటానా దర్బార్ బ్యాంక్, వాడియా స్టేట్ బ్యాంక్ తో సహా ఈ నాలుగు దర్బార్ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రలో విలీనం చేయబడ్డాయి 1 జూలై 1950 జులై 1 నుండి దాని శాఖలుగా పరిగణనలోకి వచ్చాయి.1950 చివరిలో బ్యాంకుకు కేవలం 9 శాఖలు, రూ .7 కోట్ల డిపాజిట్లు మాత్రమే ఉన్నాయి.[1]
1960 లో ప్రత్యేక గుజరాత్ రాష్ట్రం ఏర్పడిన తరువాత బ్యాంక్ ప్రధాన కార్యాలయం సౌరాష్ట్ర గుజరాత్‌లో భాగమైంది.అదే సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రతో పాటు ఇతర ప్రధాన ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సబ్సిడియరీ బ్యాంక్స్) చట్టం,1959 ప్రకారం స్వాధీనం చేసుకుంది.
ఆ సమయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర శాఖల సంఖ్య 24 కి పెరిగింది. మొత్తం డిపాజిట్లు రూ .13.39 కోట్లు, మొత్తం అడ్వాన్స్ రూ .7.93 కోట్లు, పెట్టుబడి పోర్ట్‌ఫోలియో రూ .8.04 కోట్లుగా ఉంది.పెయిడ్ అప్ క్యాపిటల్, నిల్వలు రూ .1.51 కోట్లు. బ్యాంకులో 866 మంది ఉద్యోగులు అప్పటికి పనిచేస్తున్నారు. ఉన్నారు.బ్యాంక్ మొదటి ఛైర్మన్ జగుభాయ్ ఎస్. పరిఖ్, అతను 1960 వరకు పనిచేశాడు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 25, 2007 న, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర విలీనానికి ముందుకు వెళ్ళింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1955 ప్రకారం విలీనం ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆమోదానికి లోబడి ఉంటుంది.2008 ఆగష్టు 13 న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర బ్యాంకు విలీనం అయ్యింది.విలీనం చేసే సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర బ్యాంకు 15 రాష్ట్రాలలో 423 బ్రాంచి శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.ఇందులో కేంద్ర పాలిత ప్రాంతమైన డయూ, డామన్ లో కూడా శాఖ ఉంది.[2][3]