స్ట్రీట్ డ్యాన్సర్ 3డి | |
---|---|
దర్శకత్వం | రిమో డిసౌజా |
రచన | స్క్రీన్ ప్లే: జగదీప్ సింధు తుషార్ హిరానందని డైలాగ్స్: ఫర్హాద్ సామ్జి జగదీప్ సింధు |
కథ | రిమో డిసౌజా |
నిర్మాత | భూషణ్ కుమార్ లిజెల్లే డిసౌజా కృష్ణకుమార్ దివ్య ఘోస్లా కుమార్ |
తారాగణం | వరుణ్ ధావన్ శ్రద్ధా కపూర్ ప్రభు దేవా నోరా ఫతేహి |
ఛాయాగ్రహణం | విజయ్ కుమార్ అరోరా |
కూర్పు | మనన్ అజయ్ సాగర్ |
సంగీతం | పాటలు: సచిన్–జిగర్ తనిష్క్ బాగ్చి బాద్షాహ్ గురు రంధావా గురిందర్ సీగల్ హర్ష ఉపాధ్యాయ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: సచిన్–జిగర్ |
నిర్మాణ సంస్థలు | టి-సిరీస్ రెమో డిసౌజా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
పంపిణీదార్లు | ఏఏ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 24 జనవరి 2020 |
సినిమా నిడివి | 141నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 70 కోట్లు[2] |
బాక్సాఫీసు | 97 కోట్లు[3] |
స్ట్రీట్ డ్యాన్సర్ 3డి 2020లో విడుదలైన హిందీ సినిమా. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించగా, రిమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, లిజెల్లే డిసౌజా, కృష్ణకుమార్, దివ్య ఘోస్లా కుమార్ నిర్మించారు. ఈ సినిమా 2020, జనవరి 24న విడుదలైంది.[4]
లండన్ లో జరిగే అంతర్జాతీయ డాన్స్ రియాలిటీ షోలో పాల్గొనేందుకు భారత్ పాకిస్తాన్ నుండి నృత్య బృందాలు వస్తాయి. భారతదేశం తరపున సహేజ్(వరుణ్) పాకిస్తాన్ దేశం తరపున ఇనాయత్ (శ్రాద్ధ కపూర్) సారధ్యం వహిస్తారు. ఈ రెండు బృందాలు తరచూ గొడవ పడుతాయి వీరికి రామ్ ప్రసాద్ (ప్రభు దేవా)తో పరిచయమవుతాడు. ఆయన ఆ రెండు బృందాలకు డాన్స్ అనే కళను సాటి మనిషికి సహాయం చేసేందుకు ఉపయోగించాలి అని హితబోధ చేస్తాడు. ఆయన సూచన మేరకు వారు ఏమి చేశారు అనేది సినిమా కదాంశం.