స్పైడర్ | |
---|---|
దర్శకత్వం | ఎ.ఆర్.మురగదాస్ |
రచన | ఎ.ఆర్.మురగదాస్ |
నిర్మాత | మధు బి, నల్లమలపు శ్రీనివాస్ |
తారాగణం | మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ |
ఛాయాగ్రహణం | సంతోష్ శివన్ |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | హారీష్ జయరాజ్ |
నిర్మాణ సంస్థ | NVR Cinema |
పంపిణీదార్లు | Reliance Entertainment Lyca Productions (Tamil Nadu) |
విడుదల తేదీ | 27 సెప్టెంబరు 2017 |
సినిమా నిడివి | 134 minutes |
దేశం | India |
భాషలు | తెలుగు, తమిళ్ |
మహేష్ బాబు, మురగదాసు దర్శకత్వంలో నటించిన ద్విభాష చిత్రం.[1]
ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ 51 కోట్లు సాధించిన మొదటి సాంఘిక చిత్రం సినీ చరిత్ర లో ఇదే అని ఇప్పటి వరకు చెప్పుకోవాలి. శివ (మహేశ్) ఇంటలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తుంటాడు. షూటింగ్‌లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తప్పులు జరగకముందే తెలుసుకుని వారిని కాపాడటంలో ఆత్మసంతృప్తి ఉందని నమ్ముతాడు. ఆ ప్రకారం తన అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లను సిద్ధం చేసుకుంటాడు. ప్రజలు మాట్లాడే వ్యక్తిగత ఫోన్ల ద్వారా కొన్ని పదాలు వినిపిస్తే తనకు సమాచారం వచ్చేలా రెండు సాఫ్ట్‌వేర్‌లను సిద్ధం చేసుకుంటాడు. ఆ ప్రకారమే కొందరిని కాపాడుతుంటాడు. ఈ పనిలో అతనికి మరో ముగ్గురు స్నేహితులు సాయం చేస్తుంటారు. ఓ సారి ఇతనికి సాయం చేయబోయి పోలీస్ ఉద్యోగం చేస్తున్న స్నేహితురాలు ప్రాణాలను పోగొట్టుకుంటుంది. దాంతో దానికి కారకులెవరనే విషయాన్ని ఆరాతీస్తాడు.
భైరవుడు (ఎస్.జె.సూర్య), అతని తమ్ముడు (భరత్) గురించిన విషయాలు అప్పుడే వెలుగులోకి వస్తాయి. ఇతరుల ఏడుపు విని ఆనందాన్ని అనుభవించే ఆ సోదరుల నేపధ్యం ఏంటి? జనాల ఏడుపులు వినడానికి వాళ్లు ఎంత దూరానికైనా తెగిస్తారా? ఆసుపత్రిలో ఉన్న రోగుల ప్రాణాలతో భైరవుడు ఎలా ఆడుకున్నాడు. ఆ ఆట నుంచి జనాలను కాపాడటానికి శివకు చార్లీ (రకుల్ ప్రీత్ సింగ్) ఎలా సాయం చేసింది? ఇంతకూ శివకు, చార్లీకి పరిచయం ఎలా జరిగింది? వంటివన్నీ కథలో భాగం.
సెప్టెంబర్ 27 2017 రోజున తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయ్యింది .